Woman Arrested In Track Blast | రైల్వే ట్రాక్ పేలుడు కేసులో మహిళ, మరో వ్యక్తి అరెస్ట్.. పాక్‌తో సంబంధాలు
Woman Arrested In Track Blast | రైలు పట్టాలను పేల్చేసిన కేసులో ఒక మహిళ, ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రెండు ఆయుధాలు, 46 కాట్రిడ్జ్‌లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది.
చండీగఢ్: రైలు పట్టాలను పేల్చేసిన కేసులో ఒక మహిళ, ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రెండు ఆయుధాలు, 46 కాట్రిడ్జ్‌లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. (Woman Arrested In Track Blast) నవంబర్ 3న రాత్రి 9:45 గంటల సమయంలో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా రామ్సింగ్పూర్ సమీపంలోని రైలు పట్టాలపై పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రెండు రైల్వే స్లీపర్లు ధ్వంసం కావడంతో పాటు రెండున్నర అడుగుల లోతులో ఒక గొయ్యి ఏర్పడింది. అక్కడి రైలు పట్టాలకు నష్టం వాటిల్లింది. ఈ పేలుడుకు 75 నిమిషాల ముందు అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ ప్యాసింజర్ రైలు ఈ ట్రాక్‌పై ప్రయాణించింది. నిందితులు ఈ రైలును పేల్చేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానించారు.
కాగా, రాజస్థాన్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), శ్రీ గంగానగర్ పోలీసులు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా దీనిపై దర్యాప్తు చేపట్టారు. పాకిస్థాన్‌తో సంబంధాలున్న 21 ఏళ్ల మహాక్దీప్ కౌర్, ఆమెకు సహకరించిన 22 ఏళ్ల దవీందర్ సింగ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జైలులో ఉన్న భర్త నుంచి విడిపోయిన కౌర్ వేరుగా నివసిస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. పాకిస్థాన్‌లోని ఇద్దరు హ్యాండ్లర్లతో ఆమెకు సంబంధాలున్నాయని చెప్పారు. వారిలో ఒకరిని ‘చాచా’ అని, మరొకరిని ‘షా’ అని పిలుస్తారని వివరించారు.
మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్లు కౌర్‌తో ప్రేమపూర్వక సంభాషణలో పాల్గొని, ఆమెను ట్రాప్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. రైల్వే ట్రాక్‌పై పేలుడు జరిపేందుకు పాక్ హ్యాండ్లర్ల నుంచి ఆమె డబ్బు తీసుకున్నట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. కౌర్ నుంచి రెండు ఆయుధాలు, 46 కాట్రిడ్జ్‌లు, రూ. 30,000 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులకు వసతి, బైక్, నేర స్థలానికి రవాణా సౌకర్యం కల్పించి సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Arrested In Track Blast | రైల్వే ట్రాక్ పేలుడు కేసులో మహిళ, మరో వ్యక్తి అరెస్ట్.. పాక్‌తో సంబంధాలు
Road accident | గ్యాస్ రిఫైనరీ ఉద్యోగుల బస్సు బోల్తా.. 12 మంది దుర్మరణం..!
KCR | హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీకంలో పాల్గొన్న కేసీఆర్.. వీడియో
KTR | రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ఎక్స్‌లో కేటీఆర్
IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. పుణె ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

