‘ప్రభుత్వ ఉద్యోగిపై దర్యాప్తునకు అనుమతి అక్కర్లేదు’
లంచం డిమాండ్ చేశాడని ప్రభుత్వ ఉద్యోగిపై వచ్చే ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి ముందస్తు అనుమతి అవసరంలేదని సుప్రీంకోర్టు తెలిపింది. అటువంటి చర్య అధికారిక విధుల నిర్వహణకు సంబంధించినది కాదని, అందువల్ల ముందస్తు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 19 : లంచం డిమాండ్ చేశాడని ప్రభుత్వ ఉద్యోగిపై వచ్చే ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి ముందస్తు అనుమతి అవసరంలేదని సుప్రీంకోర్టు తెలిపింది. అటువంటి చర్య అధికారిక విధుల నిర్వహణకు సంబంధించినది కాదని, అందువల్ల ముందస్తు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తనపై అవినీతి అభియోగాన్ని నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ తేజారామ్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ, జస్టిస్ యూఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం ఈనెల 16న తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ అంజరియా తీర్పును వెలువరిస్తూ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద తేజారామ్పై అభియోగాన్ని నమోదు చేస్తూ విచారణ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి రాజస్థాన్ హైకోర్టు నిరాకరించడాన్ని సమర్థించారు.
2018లో సవరించిన ఈ చట్టంలోని సెక్షన్ 7 తమ ప్రభుత్వ విధులను అక్రమంగా లేదా అధర్మంగా నిర్వహించేందుకు అనుచిత ప్రయోజనాన్ని స్వీకరించే, పొందే లేదా పొందేందుకు ప్రయత్నించే ప్రభుత్వోద్యోగులకు శిక్షను విధిస్తుంది. కొన్ని నేరాలపై విచారణ లేదా దర్యాప్తు చేపట్టేందుకు చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం అధికారులు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని, అయితే రద్యాప్తు సంస్థ ఈ ముందస్తు అనుమతిని పొందలేదన్న తేజారమ్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గత తీర్పులను ఉటంకిస్తూ నిధుల దుర్వినియోగం, ఖాతాల్లో తప్పు నమోదులు, మోసం, నమ్మకద్రోహం, లంచం తీసుకోవడం వంటి నేరాలు సక్షన్ 17ఏ పరిధిలోకి రావని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

