పీసీసీ చీఫ్, పొంగులేటికి బీఆర్ఎస్ నోటీస్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. కొండపోచమ్మసాగర్ నీటిని కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు మళ్లించారని తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్చార్జి సోమ భరత్‌కుమార్ సోమవారం ఈ నోటీసులు పంపించారు.
- ఇతర కాంగ్రెస్ నేతలకు సైతం లీగల్ నోటీసులు
- కేసీఆర్‌పై తప్పుడు ప్రచారానికి పార్టీ లీగల్‌సెల్ స్పందన
- సోషల్ మీడియా పోస్టులను బేషరతుగా తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. కొండపోచమ్మసాగర్ నీటిని కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు మళ్లించారని తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్చార్జి సోమ భరత్‌కుమార్ సోమవారం ఈ నోటీసులు పంపించారు.
ఇదే అంశంపై ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు పంపించారు. తమ సోషల్‌మీడియా ఖాతాల్లో చేసిన పోస్టులను తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని నోటీసులో డిమాండ్ చేశా రు. సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను సహించబోమ ని హెచ్చరించారు. నోటీసులకు స్పందించక పోతే పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్ర కారం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

