డీఎంకే, వైసీపీ ఎటు?
మహిళా రిజర్వేషన్‌తో కూడిన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై రాజ్యాంగ సవరణను ఆమోదింపచేయాలన్న కేంద్రం ప్రయత్నాలకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డీఎంకే, వైసీపీల డిమాండ్ ఆటంకం కలిగించే అవకాశం ఉంది. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే ఎన్డీయే ప్రయత్నాలకు కీలకమైన ఈ రెండు ప్రాంతీయ పార్టీల మద్దతుపై అనిశ్చితి నెలకొన్నది.
- డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లుకు మద్దతుపై సందిగ్ధం
- సీఈసీ తొలగింపు డిమాండ్‌తో మోదీ సర్కార్‌లో అనిశ్చితి
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: మహిళా రిజర్వేషన్‌తో కూడిన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై రాజ్యాంగ సవరణను ఆమోదింపచేయాలన్న కేంద్రం ప్రయత్నాలకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డీఎంకే, వైసీపీల డిమాండ్ ఆటంకం కలిగించే అవకాశం ఉంది. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే ఎన్డీయే ప్రయత్నాలకు కీలకమైన ఈ రెండు ప్రాంతీయ పార్టీల మద్దతుపై అనిశ్చితి నెలకొన్నది. డీలిమిటేషన్ విషయంలో మద్దతు కోసం 22 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్న డీఎంకేను బీజేపీ సంప్రదించినట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు వైసీపీ ఎన్డీయే కూటమికి వెలుపల ఉన్నప్పటికీ ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంతో సహా పలు వివాదాస్పద ప్రభుత్వ బిల్లులకు మద్దతు ఇచ్చింది. అయితే సీఈసీని తొలగించాలనే డిమాండ్‌కు ఇప్పుడు రెండు పక్షాలు గట్టి మద్దతు తెలుపుతున్నాయి. కానీ, కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనపై వాటి వైఖరి ఇంకా స్పష్టంగా లేదు.
ఈ నెల చివరిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు!
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఈనెల చివరిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాల మధ్య ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ ఏవైనా సవరించిన ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం కోరారు. అలాగే దీర్ఘకాల ప్రభావం చూపే రాజ్యాంగ మార్పులను తొందరపాటుతో చేయవద్దని హెచ్చరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ముగించడంలో(ప్రోరోగ్) చోటుచేసుకున్న అనూహ్య జాప్యాన్ని ఎత్తిచూపుతూ ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటి నుంచి ఇప్పటికే 64 రోజులు గడిచిపోయాయని ఖర్గే పేర్కొన్నారు.
సీఈసీ నియామక చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన చేశారు. 2023లోపార్లమెంట్ ఆమోదించిన సీఈసీ నియామకానికి సంబంధించిన చట్టానికి తాను మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, కేంద్ర ఎన్నికల కమిషనర్లు ఎవరూ కూడా అధికార పార్టీల ద్వారా నామినేట్ చేయబడకూడదు. గతంలో మేము కేంద్ర ప్రభుత్వం అనుసరించే నియామక విధానానికి మద్దతు ఇచ్చాం. కానీ నేడు అందుకు చింతిస్తున్నాం. ఆ తప్పు చేసినందుకు విచారిస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి తనను పరీక్షించే వ్యక్తిని నియమించలేడు కదా! అని జగన్ ఒక విలేకరుల సమావేశంలో అన్నారు. 100 మందికి పైగా విపక్ష ఎంపీల సస్పెన్షన్ మధ్య పార్లమెంట్ ఆమోదించిన 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

