RCB vs DC : సొంతమైదానంలో ఢిల్లీతో జరుగుతున్న కీలక పోరులో ఆర్సీబీ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బౌండరీలతో హోరెత్తిస్తున్నవిరాట్ కోహ్లీ(27)ని ఇషాంత్ బోల్తా కొట్టించాడు. విరాట్ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్ ఒడిసిపట్టుకున్నాడు.
అంతే.. స్టేడియంలో నిశబ్దం ఆవరించగా.. 36 వద్ద ఆర్సీబీ రెండో వికెట్ పడింది. రజత్ పాటిదార్(15) ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. మరో ఎండ్‌లో డేంజరస్ విల్ జాక్స్ 1 పరుగుతో ఆడుతున్నాడు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 51/2.
#RCB openers dismissed#DC bowlers making early in roads with 2 big wickets 🙌
Follow the Match ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/KpMUXFJLqG
— IndianPremierLeague (@IPL) May 12, 2024
టాస్ ఓడిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(6) సిక్సర్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద ఫ్రేజర్‌కు చిక్కాడు. దాంతో, 23 పరుగుల వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ బౌండరీలతో భయపెట్టినా.. ఇషాంత్ మాటల యుద్ధంలో పైచేయి సాధించి అతడిని వెనక్కి పంపాడు.