నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 47,594మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 240 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు నిర్వహణ
- ఎగ్జామ్స్ రాయనున్న 47,594మంది విద్యార్థులు
- ఐదు నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి
- ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాధికారులు
నెట్వర్క్ నమస్తే తెలంగాణ, మార్చి 13 : తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 47,594మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 240పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పది పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం 9:30 గంటల నుంచి మ ధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించునున్నారు. పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా కల్పించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖాధిరులు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రంలోకి ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. పరీక్షా సమయాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఇప్పటికే విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

