e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home News తిరుమలలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమలలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమలలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల‌ 13న ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించినట్లు తెలిపారు.

తిరుమలలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, స్వామివారి మూలవిరాట్టును శ్వేతవస్త్రంతో పూర్తిగా కప్పి, నంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు.

తిరుమలలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

అనంత‌రం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయగోడలకు ప్రోక్షణ చేశారు. తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్రశాంత్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

త‌మిళ‌నాడులో ఓటేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌
చెత్త ట్రాక్ట‌ర్‌లో వెంటిలేట‌ర్ల త‌రలింపు
ఓటుహక్కును వినియోగించుకోండి : ప్రధాని పిలుపు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్‌ కేసులు
తమిళనాడు పోల్స్‌ : అభిమానులపై అజిత్‌ ఆగ్రహం.. సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌..
టోక్యో ఒలింపిక్స్‌కు నార్త్ కొరియా దూరం
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ఇస్తే 90 శాతం స‌మ‌ర్థ‌వంతం
ఇండోనేషియా వ‌ర‌ద‌లు.. 150 దాటిన మృతుల సంఖ్య
కొవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష
క‌రోనాపై గూగుల్ డూడుల్ ప్ర‌త్యేక సందేశం
18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వండి.. ప్ర‌ధానిని కోరిన ఐఎంఏ
వాంఖ‌డే స్టేడియంలో మ‌రో ముగ్గురికి క‌రోనా
నేటి నుంచి ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ
బీజేపీ గెలుపు యంత్రం కాదు.. ప్ర‌జ‌ల్లో ఒక చైత‌న్యం: ప్ర‌ధాని మోదీ
మ‌నుషుల నుంచి పిల్లులు, కుక్క‌ల‌కు క‌రోనా: డ‌బ్ల్యూహెచ్‌వో
‌హ‌ల్దీ, గ‌జ్వేల్ కాల్వ‌లోకి కాళేశ్వ‌ర జ‌లాలు విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్
త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

Advertisement
తిరుమలలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement