అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె ‘జయమ్మ’ అనే కీలకమైన పాత్రను పోషిస్తున్నది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆమెకు వీడ్కోలు తెలుపుతూ చిత్రబృందం భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చారిత్రాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ విడుదల కానున్నది.