యూఎస్ రిబాకినాదే
సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కజకిస్థాన్ అమ్మాయి ఎలెనా రిబాకినా దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫైనల్లో రిబాకినా.. 6-4, 5-7, 6-2తో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంకా (బెలారస్)కు షాకిచ్చి ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది. ప్రపంచ 1, 2వ ర్యాంకర్ల మధ్య మూడు సెట్ల పాటు 2 గంటల 21 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ పోరులో రిబాకినానే పైచేయి అయింది.
న్యూయార్క్: సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కజకిస్థాన్ అమ్మాయి ఎలెనా రిబాకినా దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫైనల్లో రిబాకినా.. 6-4, 5-7, 6-2తో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంకా (బెలారస్)కు షాకిచ్చి ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది. ప్రపంచ 1, 2వ ర్యాంకర్ల మధ్య మూడు సెట్ల పాటు 2 గంటల 21 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ పోరులో రిబాకినానే పైచేయి అయింది.
న్యూయార్క్‌లో హ్యాట్రిక్ టైటిల్ నెగ్గాలన్న సబలెంకా ఆశలను అడియాసలు చేస్తూ నయా వరల్డ్ నంబర్ వన్ తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ సబలెంకాపై గెలిచిన కజకిస్థాన్ ప్లేయర్.. తాజాగా న్యూయార్క్‌లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ ఆమె ‘త్రీ పీట్’ ఆశలపై నీళ్లుచల్లింది. సెమీస్‌లో గాఫ్‌ను ఓడించి బెలారస్ భామ నుంచి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న ఈ ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్.. తాజాగా యూఎస్ ఓపెన్‌నూ గెలిచి వారం రోజుల వ్యవధిలోనే తన ప్రత్యర్థికి ‘డబుల్’ షాకులిచ్చింది. మహిళల సింగిల్స్‌లో 99 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్న సబలెంకా స్థానాన్ని వచ్చేవారం నుంచి రిబాకినా ఆక్రమించనుంది.
స్వయం తప్పిదాలతో..
న్యూయార్క్‌లో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరి 2023 (ఫైనల్లో గాఫ్ చేతిలో ఓటమి) తర్వాత ఓటమన్నదే లేకుండా సాగుతూ 2012-14 (సెరెనా విలియమ్స్) తర్వాత ఇక్కడ హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన సబలెంకా.. స్వయంకృతాపరాధాలతో టైటిల్‌ను చేజార్చుకుంది. మ్యాచ్‌లో మొత్తం ఏకంగా 34 అనవసర తప్పిదాలు చేయడం ఆమె ఓటమికి కారణమయ్యాయి. తొలిసెట్లో ఇరువురు నువ్వానేనా అన్నట్టు తలపడ్డా ఆరో గేమ్‌లో గెలిచిన కజకిస్థాన్ ప్లేయర్ 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది. క్రమంగా వెనుకబడ్డా సబలెంకా.. పదో గేమ్‌లో తన ట్రేడ్‌మార్క్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు ఆడటంలో విఫలమై ప్రత్యర్థికి పాయింట్లు ఇచ్చుకుంది.
బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో రిబాకినా గేమ్‌తో పాటు సెట్‌నూ గెలుచుకుంది. రెండో సెట్ సైతం ఉత్కంఠగా సాగిన సబలెంకా అద్భుతంగా పుంజుకుంది. పదో గేమ్‌లో స్కోర్లు 5-5తో సమమైనా వరుసగా రెండు పాయింట్లు సాధించిన బెలారస్ బామ.. మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లింది. అయితే నిర్ణయాత్మక సెట్లో రిబాకినా జోరుతో పోరు ఏకపక్షమే అయింది. కోర్టులో ప్రత్యర్థులపై అరుపులు, కేకలతో విరుచుకుపడే సబలెంకాతో పోలిస్తే కూల్‌గా తన పని తాను చేసుకుపోయే రిబాకినా.. 2-1 ఆధిక్యంతో గెలుపుదిశగా సాగింది. స్కోరు 5-2తో ఉండగా మ్యాచ్ పాయింట్‌ను సాధించి ఏస్‌తో సెట్‌ను ముగించి తన కెరీర్లో తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది. మ్యాచ్‌లో రిబాకినా మొత్తం 12 ఏస్‌లు సందించగా 36 విన్నర్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. తాజా ఓటమితో 2023 తర్వాత ఈ టోర్నీలో అపజయమెరుగని సబలెంకా 19 విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మ్యాచ్ ముగిశాక ఆమె రాకెట్‌ను నేలకేసి కొట్టడమే గాక తనవైపుగా వచ్చిన కెమెరాలను అభ్యంతరకరంగా దూషిస్తూ అసహనం వ్యక్తం చేసింది.
ప్రైజ్‌మనీ
రిబాకినా రూ.52.58 కోట్లు ,సబలెంకా రూ.26.75 కోట్లు
పదేండ్లుగా ఇక్కడికి వస్తున్నా. కానీ ఈ వారం రోజుల్లో నేను ఊహించని ఎన్నో విజయాలు సొంతమయ్యాయి. ఈ ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. ఐయామ్ సూపర్ హ్యాపీ – రిబాకినా
3 రిబాకినా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (2022 వింబుల్డన్, 2026 ఆస్ట్రేలియా, 2026 యూఎస్)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

