సిటీబ్యూరో, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత జాబితా సమస్యపై గళమెత్తిన తెలంగాణ రియల్టర్ల గొంతు నొకేందుకు సరారు కుట్రలు పన్నుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల ఆస్తుల హకులను కాలరాస్తున్న నిషేధిత జాబితా తీరుపై నిలదీసిన వారిపైనే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు మండిపడుతున్నాయి. సమస్యను మీడియా ముందుకు తీసుకొచ్చి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన వారిని లక్ష్యంగా చేసుకొని పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు.
వచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచే పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, రియల్టర్ సంఘాల ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 22 ఏ జాబితా విడుదలైన నాటి నుంచి సరారు తప్పిదాలను బహిర్గతం చేస్తూ వస్తున్న తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ నేతలను ఎంపిక చేసి మరీ ఈ నిర్బంధాలకు గురిచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా చర్యల ముసుగులో, తమను నిలదీసేవారి నోరు మూయించే ప్రయత్నమేనని బాధితులు వాపోతున్నారు.
నిషేధిత జాబితా వల్ల సామాన్యులు ఎదురొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిషారం కోసం ప్రయత్నించిన వారినే సరారు ఓర్వలేకపోతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బాధితుల తరఫున నిలబడి అధికారులతో మాట్లాడి సమస్యను చకదిద్దే అవకాశం లేకుండా చేస్తున్నారని, ప్రతిసారి నిర్బంధాలు కేసులతో భయపెట్టే ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తనకు జరిగిన హౌస్ అరెస్ట్ పై ఆయన ఇలా పేరొన్నారు. ‘అరెస్టులు చేసినా పోరాటం ఆగదు.. 22 ఏ సమస్యలను బయటపెట్టి లక్షల మంది బాధ్యతల తరఫున మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఒక సంచలనం సృష్టించటం జరిగింది.
ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున, రియల్టర్ల తరఫున భవిష్యత్తులో కూడా నిల్చుంటానని తెలియజేస్తూ నాకు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు. ఈరోజు ఉప్పల్ భగాయత్ లో ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్న కారణంగా నన్ను హౌస్ అరెస్ట్ చేసినారు’ అని పేరొన్నారు. అయితే 22 ఏ జాబితా సమస్యను లక్షలాది మంది తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత, తమపై ఇలా కేసులు, అరెస్టుల ద్వారా ఒత్తిడి తేవడం ఏ మేరకు సమంజసమని రియల్ ఎస్టేట్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సమస్యను లేవనెత్తినందుకు తమను టార్గెట్ చేయడం కంటే, జాబితాలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిని పరిషరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బాధితులు, రియల్టర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.