అమరావతి : ఏపీలోని విశాఖ ( Visaka ) జిల్లా రుషికొండ బీచ్ ఐటీ హిల్స్ వద్ద ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు ( Youths Missing ) . గాంధీ జయంతి సందర్భంగా సెలవు కారణంగా సమీపంలోని మదురవాడకు చెందిన 10 మంది బీచ్‌కు రాగా వీరిలో ముగ్గురు గల్లంతయినట్లు మిగతా చిన్నారులు పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు.
దీంతో సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లైఫ్గార్డు, మెరైన్ పోలీసుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గల్లంతయిన వారి వివరాలను సేకరిస్తున్నారు.