కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన రాథోడ్ హరిలాల్ -విజయ దంపతుల కూతురు రాథోడ్ వైష్ణవి ( Rathod Vaishnavi ) ఎంబీబీఎస్ సీటు ( MBBS Seat ) సాధించి ఆదర్శంగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని మండల వీబీ జీ రామ్ జీ శాఖ ఉద్యోగులు శుక్రవారం ఆమెను సన్మానించి అభినందించారు.
మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుకు కూత వేటు దూరంలోని మారుమూల గిరిజన రంజిని తండాకు చెందిన రాథోడ్ వైష్ణవి వైద్య విద్యలో అడుగుపెట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి కఠిన శ్రమతో ఎంబీబీఎస్ సీటును దక్కించుకుని గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారని వక్తలు పేర్కొన్నారు.వైద్య వృత్తిలో ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు సంతోష్, దత్తు, మహేష్, సాగర, రోజా, సీవోలు గిరీష్, సాగర్, మండలంలోని ఆయా జీపీల ఫీల్డ్ అసిస్టెంట్లు రాథోడ్ వైష్ణవి ని అభినందించారు.