తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కింది మొదలు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై ఆంధ్రా పెత్తనం చెలాయిస్తున్నది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రేవంత్ సర్కార్ ఏపీకి నీటిని ధారాదత్తం చేసింది. కేఆర్ఎంబీ ఆదేశాలను తుంగలో తొక్కి.. శ్రీశైలం నిండకుండా అడ్డుపడి.. పోతిరెడ్డిపాడు నుంచి పక్కరాష్ట్రం యథేచ్ఛగా నీటిని మళ్లించుకుంటున్నా.. దౌర్జన్యంగా సాగర్ కుడికాలువ నుంచి జలాలను తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. కృష్ణా నది కింద ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలో పచ్చగా ఉన్న పంట పొలాలు.

వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ సాధించిన ఘనతకు నిదర్శనమిది.. బీఆర్ఎస్ హయాంలో పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ రెండున్నరేండ్లుగా ఏడారై ఏడుస్తున్నది. ఇదే కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోయకుండా రేవంత్ సర్కార్ ఆడుతున్న రాజకీయ చదరంగంలో రాష్ట్ర రైతులే పావులుగా మారుతున్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల్లో నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా పడావు పెట్టి నీటిని ఎత్తకుండా మొండి‘చెయ్యి’ చూపుతున్న ప్రభుత్వ నిర్వాకంతో వనపర్తి జిల్లా దవాచుపల్లిలో వానకాలంలోనే ఎండుముఖం పట్టిన వరిపొలమిది..
