చెత్త ట్రాక్టర్లో వెంటిలేటర్ల తరలింపు
వెంటిలేటర్ల తరలింపు | చెత్తను తరలించే ట్రాక్టర్లలో వెంటిలేటర్లను తరలించడంతో ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు

సూరత్ : చెత్తను తరలించే ట్రాక్టర్లలో వెంటిలేటర్లను తరలించడంతో ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. గుజరాత్లో సోమవారం ఒక్కరోజే 3 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదు కావడం గుజరాత్లో ఇదే తొలిసారి.
అయితే సూరత్ జిల్లాలో కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. దీంతో వల్సాడ్ నుంచి సూరత్‌కు వెంటిలేటర్లను తరలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ వెంటిలేటర్ల తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వహించారు.
ఐసీయూలో ఉండే వెంటిలేటర్లను చెత్త ట్రాక్టర్లో తరలించడంతో వల్సాడ్ జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే వెంటిలేటర్ల తరలింపు కోసం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ చెత్త ట్రాక్టర్‌ను వల్సాడ్‌కు పంపింది.
సోమవారం ఒక్కరోజే గుజరాత్లో కొత్తగా 3,160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ కారణంగా సోమవారం 15 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 4,581కి చేరింది. అహ్మదాబాద్‌లో 773, సూరత్‌లో 603, రాజ్‌కోట్‌లో 283, వడోదరలో 216 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

