దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
దేశంలో కొవిడ్ కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 మంది కోలుకోగా.. మొత్తం 1,65,547 మంది ప్రాణాలు కోల్పోయారు.
టీకా డ్రైవ్‌లో భాగంగా 8,31,10,926 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. నిన్న ఒకే రోజు 12.11 లక్షలకుపైగా కొవిడ్ నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. మహమ్మారి ప్రారంభం నుంచి నిన్నటి వరకు 25.02 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 47,288 నమోదయ్యాయి. కొత్త కేసుల్లో దాదాపు 49 శాతం వరకు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్ణాటకలో 5,279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
చెత్త ట్రాక్టర్లో వెంటిలేటర్ల తరలింపు
ఓటుహక్కును వినియోగించుకోండి : ప్రధాని పిలుపు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

