బీజేపీ గెలుపు యంత్రం కాదు.. ప్రజల్లో ఒక చైతన్యం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్నింగ్ మిషన్ అంటూ ఎద్దేవా చేసేవాళ్లు, వాళ్లు గెలిస్తే మాత్రం అది తమ గొప్పగా చెప్పుకుంటుండం విడ్డూరమని వ్యాఖ్యానించారు. తమ పార్టీని పోలింగ్ విన్నింగ్ మిషన్ అంటూ ఎద్దేవా చేసేవాళ్లకు భారత రాజ్యాంగంపై అవగాహన లేనట్లేనన్నారు. బీజేపీ పోల్ విన్నింగ్ మిషన్ కాదని, ప్రజలతో మమేకమై ఉన్న ఒక చైతన్యమని పేర్కొన్నారు.
బీజేపీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని.. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై కూడా స్పందించారు. కేంద్రం ఏ చట్టాలు చేసినా.. అవి వ్యవసాయ చట్టాలుగానీ, పౌరసత్వ సవరణ చట్టంగానీ, కార్మిక చట్టాలుగానీ వాటిపై తప్పుడు ప్రచారం జరుగుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. రాజకీయ అస్థిరతను సృష్టించడమే లక్ష్యంగా అలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
పౌరసత్వ సవరణ చట్టం చేస్తే ప్రభుత్వం బలవంతంగా పౌరసత్వాలను రద్దు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు చేస్తే ప్రభుత్వం రైతుల భూములను లాగేసుకుంటున్నదని ప్రచారం చేస్తున్నారు. కార్మిక చట్టాలను చేస్తే కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శిస్తారు. కానీ ఆరోపణలన్నీ శుద్ధ అబద్దాలు. బీజేపీ కార్యకర్తలు ఇలాంటి విషయాల్లో ప్రజలకు నిజాలు తెలియజేసి చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది అని ప్రధాని వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

