మరిన్ని దేశాలకు పాకిన యుద్ధం!.. దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా
పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్, యూఎస్‌ల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. యుద్ధం కొత్త దేశాలకు కూడా విస్తరిస్తున్నది.
- తొలిసారిగా ఈజిప్ట్ పోర్టుపై దాడి
- జోర్డాన్‌లో 3 యూఎస్ ఫైటర్ జెట్లను ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటన
వాషింగ్టన్, జూలై 30: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్, యూఎస్‌ల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. యుద్ధం కొత్త దేశాలకు కూడా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు ఇరాన్-యూఎస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలోకి ఈజిప్ట్‌ను కూడా లాగారు. డమియెట్టా పోర్టులో రెండు గ్యాస్ ట్యాంకర్లపై బుధవారం డ్రోన్ల దాడి జరిగినట్టు ఈజిప్ట్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇంధన సామర్థ్యమున్న మరో దేశానికి యుద్ధం విస్తరించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. గురువారం ఉదయం ఇరాన్‌లోని 10 నగరాలు లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది.
అలాగే ఐఆర్జీసీ సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసినట్టు యూఎస్ సెంట్కామ్ ప్రకటించింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడానికి ప్రయత్నించిందని, దాడి చేయడం ఇప్పుడు తమ వంతని పేర్కొన్నారు. అమెరికా చేసిన దాడులకు తాము ప్రతీకార దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. జోర్డాన్‌లో మూడు యూఎస్ ఎఫ్-35 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, ఈజిప్ట్ సమీపంలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

