హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కాజీపేట-కొండపల్లి మార్గంలో నాన్ లాకింగ్ పనుల కారణంగా పలు ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నాయని తెలిపారు.