e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News మాస్కులు , సామాజిక దూరంతో పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి తగ్గుతోందా ? ప‌రిశోధ‌న‌లో సంచ‌ల‌న నిజాలు

మాస్కులు , సామాజిక దూరంతో పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి తగ్గుతోందా ? ప‌రిశోధ‌న‌లో సంచ‌ల‌న నిజాలు

క‌రోనా నుంచి ర‌క్ష‌ణ క‌వ‌చం మాస్క్ ! మాస్కులు పెట్టుకోవ‌డం, భౌతిక దూరం పాటించ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ మ‌న‌ల్ని చేరకుండా అడ్డుకోవ‌చ్చు ! క‌రోనా బారిన ప‌డ‌కుండా మ‌నం తీసుకుంటున్న ఈ జాగ్ర‌త్త‌లే ఇప్పుడు చిన్న పిల్ల‌ల పాలిట ప్ర‌మాదంగా మారుతున్నాయంట !! ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని ఇంగ్లండ్‌కు చెందిన రాయ‌ల్ కాలేజ్ ఆఫ్ జ‌న‌ర‌ల్ ప్రాక్టీషన‌ర్స్ ( RCGP ) అధ్య‌యనంలో వైల్ల‌డైంది.

క‌రోనా కార‌ణంగా గ‌త 15 నెల‌లుగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డం త‌గ్గించేశారు. ఒక‌వేళ బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక స్కూళ్లు మూత‌ప‌డ‌టంతో పిల్ల‌లు ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. ఇరుగు పొరుగు పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డానికి కూడా వెళ్ల‌నీయ‌డం లేదు. దీంతో వైర‌స్‌, బ్యాక్టీరియా కార‌ణంగా వ‌చ్చే ఫ్లూ, ఇత‌ర జ‌బ్బుల బారిన ప‌డడ‌టం త‌గ్గిపోయింది. దీంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుంది. దీనివ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గిపోయాక చాలా ర‌కాల వ్యాధుల‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఇమ్యూనిటీని పిల్ల‌లు పొంద‌లేక‌పోతున్నారు అని ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

- Advertisement -

ముఖ్యంగా చిన్న పిల్ల‌ల్లో వ‌చ్చే శ్వాస‌కోశ వ్యాధి రెస్పిరేట‌రీ సిన్సిటియ‌ల్ వైర‌స్ ( RSV ) విష‌యంలోనూ వైరాల‌జిస్టులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనాకు ముందు ఇత‌ర సీజ‌న‌ల్ వ్యాధుల‌తో పోలిస్తే ఈ RSV బారిన పిల్ల‌లు ఎక్కువ‌గా ప‌డేవారని నిపుణులు చెబుతున్నారు. క‌రోనాకు ముందు యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో ఏటా 30 వేల‌కు పైగా చిన్నారులు ఈ RSV బారిన ప‌డేవారు అని అంచ‌నా. వీరంతా ఐదేళ్ల లోపు చిన్నారులే కావ‌డం గ‌మ‌నార్హం. కానీ క‌రోనా కార‌ణంగా మాస్కులు ధ‌రిస్తూ భౌతిక దూరం పాటించ‌డం వ‌ల్ల గ‌త రెండేళ్లుగా ఈ వైర‌స్ కేసులు న‌మోదు కావ‌డం లేదు. దీనివ‌ల్ల ఈ వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధ‌క శ‌క్తిని పిల్ల‌లు పొంద‌లేక‌పోతున్నారు. పిల్ల‌ల్లో ఈ వైర‌స్‌ను ఎదుర్కొనే అంత ఇమ్యూనిటీ ఉండ‌దు కాబ‌ట్టి క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గిన త‌ర్వాత‌ ఈ RSV మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని నాటింగ్‌హామ్ యూనివ‌ర్సిటీలో వైరాల‌జీ విభాగ‌ ప్రొఫెస‌ర్ విలియం ఐర్వింగ్ హెచ్చ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా ? మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్ ఎంత‌సేపు బ‌తికి ఉంటుంది?

monoclonal antibody treatment : ఒక్క‌రోజులోనే క‌రోనా ల‌క్ష‌ణాలు ఖ‌తం? అస‌లేంటి ఆ ట్రీట్‌మెంట్ ? ఎవ‌రికి అవ‌స‌రం ?

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Post Corona symptoms : క‌రోనా త‌గ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Coronavirus Doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana