న్యూఢిల్లీ: అందరినీ వణికిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. 2021 చివరికల్లా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న ఫార్మా సంస్థల ఆదాయం గణనీయ స్థాయిలో పెరుగనుననది.
నాలుగు ప్రధాన వ్యాక్సిన్లతోపాటు తొమ్మిది వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నారు. వీటి వల్ల వ్యాక్సిన్ల తయారీ దారులు సుమారు 190 బిలియన్ల డాలర్ల ఆదాయం పొందుతారని ఎయిర్నిఫ్టీ లిమిటెడ్ అంచనా వేసింది.
అయితే, లాజిస్టిక్స్ సరఫరాలో జాప్యం, ప్రొడక్షన్లో ఇబ్బందుల వల్ల టీకాల తయారీ సంస్థలైన ఫార్మా కంపెనీలు 115 బిలియన్ల డాలర్ల ఆదాయం పొందుతాయి. చైనా, అమెరికాలు కేంద్రంగా పని చేస్తున్న సినోవాక్ బయోటెక్, సినోఫార్మ్ గ్రూప్, ఫైజర్, మోడెర్నా.. కొవిడ్-19 టీకా ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్నాయి.
సరిగ్గా ఏడాది క్రితం వ్యాక్సిన్ మార్కెట్ ఎలా ఉంటుందని అంచనా వేయలేకపోయామని ఎయిర్నిఫ్టీ సీఈవో రాస్మస్ బెక్ హన్సేన్ చెప్పారు. తొమ్మిది ఫార్మా సంస్థల రెవెన్యూ అత్యధికంగానే ఉంటుందని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం ప్రజలు భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని పరిశోధకులు అంటున్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కోవాక్స్‌తో ఒప్పందం మేరకు వివిధ దేశాలకు టీకాలను భారత్ సరఫరా చేసింది. ఈ లోగా వచ్చిన రెండో వేవ్‌తో దేశం గజగజ వణుకుతున్నది.
తత్ఫలితంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరాలో చైనా గణనీయ పాత్ర పోషిస్తున్నది. ఫలితంగా ఆ దేశ ఫార్మా కంపెనీలు సినోవాక్, సినోఫార్మ్ కనీసం 16 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతాయని అంచనా వేస్తున్నారు.
అయితే, కాలం గడుస్తున్నా కొద్దీ.. వివిధ దేశాలకు టీకాల సరఫరాలో సవాళ్లు పెరుగుతాయని పరిశోధకులు అంటున్నారు. డెలివరీలో జాప్యం, టీకాల ఉత్పత్తి లక్ష్యాల్లో వైఫల్యం వంటి అంశాలతో ఫార్మా సంస్థలకు వచ్చే లాభాలు 97 బిలియన్ల డాలర్ల వరకు తగ్గుతుందని అంచనా.
అమెరికా వ్యాక్సిన్ జెయింట్స్ ఫైజర్ ఒక డోస్‌పై 12-14.50 డాలర్లు, మోడెర్నా 18-32 డాలర్లు ధరగా నిర్ణయించాయి. దీని ప్రకారం ఫైజర్ లాభాలు ఈ ఏడాది 26 బిలియన్ల డాలర్లు, మొడెర్నా ఆదాయం 19 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా.
వచ్చే ఏడాది నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేయొచ్చు. అందుకు 50 బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేస్తున్నది.
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
చైనాలో ప్రత్యక్షమైన శ్రీలంక యువరాణి.. మంటలు రేపుతున్న వింత కథనాలు