బుధవారం 21 అక్టోబర్ 2020
National - Aug 24, 2020 , 19:48:30

కాంగ్రెస్‌లోనే విశ్వాసం లేదు.. అవిశ్వాస తీర్మానంపై చర్చలో విజయన్ ఎద్దేవా

కాంగ్రెస్‌లోనే విశ్వాసం లేదు.. అవిశ్వాస తీర్మానంపై చర్చలో విజయన్ ఎద్దేవా

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీలోనే విశ్వాసం లేదని, ఏఐసీసీలో దీనిపై పెద్ద చర్చ జరుగుతున్నదని కేరళ సీఎం పినరయి విజయన్ ఎద్దేవా చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరినొకరు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకోలేని స్థాయికి కాంగ్రెస్ దిగజారిందంటూ విజయన్ మండిపడ్డారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీసన్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టగా దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించారు. దీంతో ఆయన చర్చను ప్రారంభించారు.

రాష్ట్రంలోని బంగారు స్మగ్లింగ్ మాఫియా తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వినియోగించుకుంటుందని సతీసన్ ఆరోపించారు. ఈ చర్చపై మాట్లాడిన సీఎం విజయన్ కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే విశ్వాసం లేదని, ఏఐసీసీలోని నేతలంతా దీనిపైనే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo