ఇక పాటల జాతర
‘పుష్ప-2’ (ది రూల్) ప్రచార పర్వం క్రమంగా జోరందుకుంటున్నది. తొలిభాగానికి దేశవ్యాప్తంగా దక్కిన అపూర్వ ఆదరణ దృష్ట్యా ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నది.
‘పుష్ప-2’ (ది రూల్) ప్రచార పర్వం క్రమంగా జోరందుకుంటున్నది. తొలిభాగానికి దేశవ్యాప్తంగా దక్కిన అపూర్వ ఆదరణ దృష్ట్యా ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. బన్నీ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పాటల ప్రమోషన్‌కు తెరలేవనుంది.
దర్శకుడు సుకుమార్ పాటల రూపకల్పన మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనే విషయం తెలిసిందే. దాంతో ‘పుష్ప-2’ గీతాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి సంగీత ప్రియుల్లో నెలకొని ఉంది. ఈ సినిమాలో ‘పుష్ప పుష్ప పుష్పరాజ్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను మే 1న విడుదల చేయబోతున్నారు. బుధవారం విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ సినిమా గీతాలు ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాట్రోగఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: యస్.రామకృష్ణ-మోనిక నిగోత్రే, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్ బి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

