బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ తన తదుపరి చిత్రం ‘కింగ్’ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె సుహానా ఖాన్ థియేట్రికల్ ఎంట్రీ ఇస్తున్నది. సుజయ్‌ఘోష్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల పాత్రలకు కథాగమనంలో సమప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ పవర్ఫుల్ డాన్ పాత్రలో కనిపిస్తారని, ఆయన క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని సమాచారం. డర్, అన్జామ్, రేయిస్ చిత్రాల్లో షారుఖ్‌ఖాన్ పోషించిన నెగెటివ్ పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది.
ఈ నేపథ్యంలో ‘కింగ్’ సినిమాలో ఆయన పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా క్రియేటివ్ ప్రాసెస్‌లో కూడా షారుఖ్‌ఖాన్ పూర్తిగా ఇన్వాల్వ్ అవుతన్నారని, తన కూతురు నటిస్తున్న తొలి థియేట్రికల్ సినిమా కాబట్టి అన్ని అంశాలు పర్ఫెక్ట్గా ఉండాలనే లక్ష్యంతో ఉన్నారని చిత్ర బృందం చెబుతున్నది. ‘ది ఆర్చిస్’ చిత్రం ద్వారా ఓటీటీ వేదికపై అరంగేట్రం చేసిన సుహానా ఖాన్..‘కింగ్’ సినిమాతో థియేట్రికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నది. ఆగస్ట్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.