Crime news : బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను చెట్టుకు ఉరేసి చంపిన ఘటన ఒడిశా (Odisha) రాష్ట్రం కియోంఝర్ (Keonjhar) జిల్లాలోని గోపాల్పూర్ (Gopalpur) ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గోపాల్పూర్ ఏరియాలోపి టెంట్లపాషీ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. దాంతో అంతా వెతికిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు గ్రామ శివార్లలోని పొలాల్లో చెట్టుకు వేలాడుతూ బాలిక మృతదేహం కనిపించింది.
ఘటనా ప్రాంతాల్లో లభించిన మొబైల్ ఫోన్, దుస్తుల ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులు బాలికకు తెలిసినవారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలిక పోస్టుమార్టం నివేదిక వస్తే కేసు దర్యాప్తు సులువయ్యే అవకాశం ఉందని అన్నారు.