సిటీబ్యూరో, జూన్17 (నమస్తే తెలంగాణ): టీజీ టెట్(టీచర్స్ ఎలిజిబులిటి టెస్ట్) పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163(ఐపీసీ 144) సెక్షన్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. టెట్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు.
పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపల నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలసులు, ఆర్మీ, హోంగార్డ్సు, ఫ్లైయింగ్ స్కాడ్స్, అలాగే అంత్యక్రియలకు సంబంధించిన ఊరేగింపులకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఈ నేషధాజ్ఞలు 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 30 వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అమలులో ఉంటాయని వివరించారు.