Koheda Farmer | గుట్టెక్కి చూస్తే తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి లే అవుట్ కనిపిస్తది.. కోహెడ ఫ్రూట్ మార్కెట్ బాధిత రైతు
ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వమంటున్నారు కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్నబాధిత రైతులు.
Koheda Farmer | కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూముల పక్కన రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి భూములు ఉన్నాయి.. వాళ్ల భూములకు డిమాండ్ పెంచడానికి మా భూములు లాక్కుంటున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వమంటున్నారు.
ఓ రైతు మాట్లాడుతూ..ఎనుముల రేవంత్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేసిండు.. కొంచెం డబ్బులు కేటాయించిండు. అక్కడ భూమిని ఇక్కడ భూమిని చూస్తే దాని లెవలింగ్‌కు కూడా డబ్బు సరిపోదు. ఈ పక్కనే రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డికి చెందిన 300 ఎకరాలుంది. కోహెడ్ గుట్టెక్కి చూస్తే హెచ్ఎండీఏ లే అవుట్ పెట్టి ఇక్కడ నడిపిస్తున్నరు. ఇక్కడ 300 నుంచి 600 ఎకరాలు లే అవుట్ చేశారు. ఇది అవుతదా.. స్కామా మాకు ఏది అర్థం కావడం లేదన్నాడు.
ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నరు. రైతులను ఇబ్బంది పెడుతన్నరు. కోహెడ గుట్టెక్కి చూస్తే తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి లే అవుట్ కనిపిస్తది. వాళ్ల భూములకు డిమాండ్ రావడం కోసం ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేశారు. డెవలప్ మెంట్ అంటే మార్కెట్‌కు మేం సహకరిస్తం. అభివృద్దికి మేం అడ్డుపడటం లేదు. పొజిషన్ మీదున్నది పేద రైతులు, ఎస్సీ, ఎస్టీలు బీసీలున్నరు. మేమేం అంటున్నం. భూమికి భూమి అన్న ఇవ్వండి.. ఇదే కానిస్టిట్యుయెన్సీలో ఇచ్చిన నష్టపరిహారం ఇమ్మంటున్నం.. వేరే ఏం మాట్లాడలేదున్న మేం. ఈ భూమి పోతే మా పరిస్థితి చాలా గోరం.. రోడ్డు మీద పడాలే. చివరికి ఆస్తి రూపంలో మాకున్న దిక్కు ఇదేనంటూ వాపోయాడు.
ఈ భూముల పక్కన రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి భూములు ఉన్నాయి.. వాళ్ల భూములకు డిమాండ్ పెంచడానికి మా భూములు లాక్కుంటున్నారు
ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలి
ప్రాణాలైనా అర్పిస్తాము కానీ సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే భూమిని మాత్రం ఇవ్వము
కోహెడ ఫ్రూట్… pic.twitter.com/ICP4EwkWPU
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2026
Read Also :
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

