మియాపూర్ భూముల్లో సర్వే
హైదరాబాద్‌లోని అత్యంత విలువైన మి యాపూర్ భూముల్లో అధికారులు సర్వే నిర్వహించారు. శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని ప్రభుత్వ భూములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిన నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా యంత్రాంగం, హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేశారు.
- 70 ఎకరాల్లో ఖాళీ జాగాలు ఉన్నట్టు అంచనా
- మిగిలిన భూముల్లో భారీ నిర్మాణాలు
- ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు : హెచ్ఎండీఏ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని అత్యంత విలువైన మి యాపూర్ భూముల్లో అధికారులు సర్వే నిర్వహించారు. శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని ప్రభుత్వ భూములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిన నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా యంత్రాంగం, హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. మొత్తం 550 ఎకరాలుండగా.. 440 ఎకరాలు ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్నది.
మిగతా 110 ఎకరాల్లో ఖాళీ జాగా 70 ఎకరాలు ఉంటుందని అంచనా వేశారు. మిగిలిన భూముల్లో నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఫెన్సింగ్ లేని మిగిలిన ఖాళీ జాగాను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆక్రమణకు గురైన ప్రాంతాలు, అకడ వెలిసిన నిర్మాణాలపై ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తదుపరి చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఖాళీగా ఉన్న భూమిని సర్వే చేస్తున్నట్టుతెలిపారు. మరి ఆ భూములను పూర్తిగా స్వాధీనం చేసుకుంటారా? లేక వదిలిపెడతారా? అనేది తేలాల్చి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

