Vinod kumar | తుమ్మిడిహట్టి ప్రాజెక్టును అడ్డుకున్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే : మాజీ ఎంపీ వినోద్ కుమార్
Vinod Kumar | మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించడానికి అనుమతి ఇవ్వం అని చెప్పింది ఆనాటి మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
Vinod kumar | తుమ్మిడిహట్టి ప్రాజెక్టును అడ్డుకున్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయమై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఆనాడు మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడున్నది పృథ్విరాజ్ చౌహాన్ సీఎం, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. వారు (పృథ్విరాజ్ చౌహాన్) స్వయంగా లేఖ రాశారు. పృథ్విరాజ్ చౌహాన్ అక్టోబర్ 15 2013లో లేఖ రాశారన్నారు.
ఈ ప్రాజెక్టు మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నరు. దీంట్లో 152 మీట్లర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్లో నిర్మిస్తే దాదాపు మా చంద్రాపూర్‌లో 22 గ్రామాలు మునుగుతాయి. గడిచౌరిలో 8 గ్రామాలు, దాదాపు 2 వేల హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేం అనుమతి ఇవ్వం అని చెబుతూ.. మీరు తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు మీరు టెండర్లు పిలుస్తున్నరు.. కాంట్రాక్టర్లులిస్తున్నరు. అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ పనులన్ని ఆపండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి అనుమతి ఇవ్వం అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని వినోద్ కుమార్ అన్నారు.
152 మీటర్ల ఎత్తులో మీరు బ్యారేజ్ కడితే మా గ్రామాలు మునిగిపోతాయని, అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదని పృథ్వీ రాజ్ చౌహాన్ లేఖ లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక పనికిమాలిన చర్య అని, డబ్బులు వృథా చేస్తున్నారని, ఈ నిర్మాణం ఆపకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ పృథ్వీ రాజ్ చౌహాన్ రాశారని వినోద్ కుమార్ వెల్లడించారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టును అడ్డుకున్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే
ఆనాడు మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీ రాజ్ చౌహాన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాడు
152 మీటర్ల ఎత్తులో మీరు బ్యారేజ్ కడితే మా గ్రామాలు మునిగిపోతాయని, అస్సలు ఒప్పుకునే… https://t.co/Vi7AL4RcA6 pic.twitter.com/Gktgnun0HV
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2026
Read Also :
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

