ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ రణభేరి
కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణభేరి మోగించనున్నారు. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ‘రైతు గర్జన’ సదస్సులు నిర్వహించనున్నారు. నేటి ఆదిలాబాద్ పర్యటన నుంచి ప్రారంభం కాబోతున్న ఈ క్షేత్రస్థాయి యాత్ర ప్రధానంగా రేవంత్‌రెడ్డి సర్కార్‌లో వంచనకు గురైన రైతులు, కార్మికులు, సామాన్యుల పక్షాన సాగనున్నది.
- కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై గులాబీ గర్జన
- ఒకే నెలలో నాలుగుచోట్ల కేటీఆర్ సభలు
- నేడు ఆదిలాబాద్‌లో రైతు గర్జనతో మొదలు
- 9న నిజామాబాద్, 11న నిర్మల్‌లో సభలు
- 29న కరీంనగర్లో దీక్షా దివస్ కార్యక్రమం
హైదరాబాద్/ఆదిలాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణభేరి మోగించనున్నారు. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ‘రైతు గర్జన’ సదస్సులు నిర్వహించనున్నారు. నేటి ఆదిలాబాద్ పర్యటన నుంచి ప్రారంభం కాబోతున్న ఈ క్షేత్రస్థాయి యాత్ర ప్రధానంగా రేవంత్‌రెడ్డి సర్కార్‌లో వంచనకు గురైన రైతులు, కార్మికులు, సామాన్యుల పక్షాన సాగనున్నది. క్షేత్రస్థాయిలో సమస్యలు స్వయంగా తెలుసుకుంటూ, మొద్దునిద్ర పోతున్న సర్కార్‌ను నిలదీసేందుకు కేటీఆర్ నడుంబిగించారు. 1న ఆదిలాబాద్, 11న నిర్మల్, 19న నిజామాబాద్‌లో నిర్వహించే రైతు గర్జన సదస్సులు, 29న కరీంనగర్లో నిర్వహించే ర్యాలీలో కేటీఆర్ పాల్గొననున్నారు.
బాధిత రైతు కుటుంబాలకు ఓదార్పు
పంట నష్టం, వ్యవసాయ సంక్షోభంతో ఇటీవల పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా వారి కుటుంబాలను పర్యటనలో భాగంగా కేటీఆర్ పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. క్లిష్ట సమయంలో రైతాంగానికి తోడుగా నిలువడమే కాకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
పరామర్శల అనంతరం రైతు గర్జన సదస్సులు నిర్వహించనున్నారు. ఇదే సందర్భంలో ఆయా జిల్లాల ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల సమన్వయకర్తలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొన్నది.

Brs Meeting
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్నాహక సమావేశం
కేటీఆర్ పర్యటన విజయవంతం చేసే బాధ్యతను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భుజానికెత్తుకొని కార్యాచరణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విసృ్తత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాల వారీగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, కేటీఆర్ రాక సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం గులాబీమయం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతాంగానికి పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సీఎం దత్తత జిల్లాలో రైతుల ఆత్మహత్యలు
ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఆదిలాబాద్ జిల్లాలో అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబీమా పథకం బాధిత కుటుంబాలకు అండగా నిలువగా కాంగ్రెస్ ఆ పథకాన్ని రద్దు చేయడంతో రైతు కుటుంబాలకు వీధిన పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క అక్టోబర్‌లోనే జిల్లాలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
రైతులకు అండగా బీఆర్ఎస్
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్.. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట చేపట్టింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో నేడు రైతు గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే ఈ సభకు తరలివచ్చేందుకు వేలాది మంది రైతులు సిద్ధమయ్యారు. సభకు ముందు కేటీఆర్ తలమడుగు మండలంలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ముఖ్యమంత్రి దత్తత జిల్లాలోనే రైతు ఆత్మహత్యలు కలవరపెడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రైతులకు అండగా నిలువక పోగా వారిలో భరోస నింపే కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు గర్జనకు రైతులు ఎక్కువ సంఖ్యలో హాజరై తమ నిరసన తెలియజేయనున్నారు.
కేటీఆర్ పర్యటన వివరాలు
1న ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభ
11న నిర్మల్‌లో రైతు గర్జన సభ
19న నిజామాబాద్‌లో రైతు గర్జన సభ
29న కరీంనగర్లో దీక్షా ర్యాలీ, సభ

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Farmers Meetings
- KTR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

