గ్రేహౌండ్స్ ల్యాండ్.. ప్రైవేట్ హ్యాండ్
మియాపూర్ భూముల పరిరక్షణలో తామెంతో కష్టపడ్డామని రేవంత్ సర్కార్ ప్రకటించుకున్న గంటల్లోనే.. భూముల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. మంచిరేవులలో మరో భూ కుంభకోణం వెలుగుచూసింది. పోలీసుశాఖకు చెందిన 10 ఎకరాల 10 గుంటల గ్రేహౌండ్స్ భూమి.. ఏకంగా ప్రైవేటు సంస్థ చేతికి వెళ్లిపోయింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొని, న్యాయస్థానాల ద్వారా 142 ఎకరాలు ప్రభుత్వానికి దక్కేలా చేసింది. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి గాలివాటంగా తయారైంది.
- మంచిరేవులలో మరో స్కామ్
- 10.10ఎకరాల సర్కార్ జాగ ప్రైవేట్‌కు ధారాదత్తం
- కేసీఆర్ కాపాడిన భూమి.. కాంగ్రెస్ పాలనలో అన్యాక్రాంతం
- 45 కోట్ల విలువున్న భూమికి జీరో కన్సిడరేషన్తో రిజిస్ట్రేషన్?
- ఇప్పటికీ అవి గ్రేహౌండ్స్ భూములేనని చూపుతున్న భూభారతి
- 142 ఎకరాల పరిరక్షణకు తీవ్రంగా కృషి చేసిన కేసీఆర్ సర్కార్
- న్యాయపోరాటంతో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రభుత్వ విజయం
- రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైకోర్టులో ఓటమిపాలు
- మరో 10 ఎకరాల ఫైరింగ్ రేంజ్ భూమికూడా వివాదంలోకి!
- స్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణకు బీఆర్ఎస్ డిమాండ్
మియాపూర్ భూముల పరిరక్షణలో తామెంతో కష్టపడ్డామని రేవంత్ సర్కార్ ప్రకటించుకున్న గంటల్లోనే.. భూముల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. మంచిరేవులలో మరో భూ కుంభకోణం వెలుగుచూసింది. పోలీసుశాఖకు చెందిన 10 ఎకరాల 10 గుంటల గ్రేహౌండ్స్ భూమి.. ఏకంగా ప్రైవేటు సంస్థ చేతికి వెళ్లిపోయింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొని, న్యాయస్థానాల ద్వారా 142 ఎకరాలు ప్రభుత్వానికి దక్కేలా చేసింది. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి గాలివాటంగా తయారైంది. ఏకంగా పది ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్లమీదికి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎవరి ఒత్తిడితో చేశారు? ఇదీ.. కాంగ్రెస్ మార్క్ ‘భూముల పరిరక్షణ’!
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు శాఖలో అత్యంత కీలకమైన గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన మంచిరేవుల భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. గ్రేహౌండ్స్ భూముల్లో సర్కార్ గద్దలు వాలి.. ఆ భూములను ‘గుంపు’గుత్తగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయి. మంచిరేవులలోని గ్రేహౌండ్స్ భూములకు సంబంధించి మొత్తం రూ.2,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా కుట్రలు చేస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్పై నిందలు మోపేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి.
ఈ భారీ స్కామ్‌కు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు మీడియాకు వెల్లడించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సుమారు 142 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కేసీఆర్ కాపాడగా.. అదే భూమిలో కొంత భాగాన్ని ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ హయాంలో 10 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి ప్రహరీ కూల్చివేత, వివాదాస్పద రిజిస్ట్రేషన్లు, జీరో కన్సిడరేషన్తో డాక్యుమెంట్ నమోదు వంటి అంశాలతోపాటు మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
1961 నుంచి భూ వివాదం..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 393/1 నుంచి 393/20 వరకు ఉన్న మొత్తం 142 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించి దశాబ్దాలుగా న్యాయపోరాటం కొనసాగుతున్నది. 1961 అక్టోబర్ 21న అప్పటి తహసీల్దార్ ఈ భూమిని 20మంది వ్యక్తులకు అసైన్ చేశారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు కేసులతో వివాదం కొనసాగింది.
1994 సెప్టెంబర్ 15న జిల్లా రెవెన్యూ అధికారి అసైన్మెంట్లను సమర్థించగా.. 1995 జనవరి 3న జిల్లా కలెక్టర్ ఆ ఉత్తర్వులను నిలిపివేసి విచారణను తిరిగి ప్రారంభించారు. దీనిపై కేసు హైకోర్టుకు వెళ్లింది. 1997 సెప్టెంబర్ 1న హైకోర్టు అసైనీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2000 జనవరి 22న డివిజన్ బెంచ్ మరో అప్పీల్‌ను కొట్టివేసింది. అదే ఏడాది ఏప్రిల్ 28న సుప్రీంకోర్టు పెండింగ్‌లో ఉన్న భూ అసైన్మెంట్ విచారణను పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
2001 డిసెంబర్ 22న జాయింట్ కలెక్టర్ డీఆర్వో ఉత్తర్వులను రద్దు చేసి భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 2002 ఏప్రిల్ 4న హైకోర్టు ఆ ఉత్తర్వులను పకనపెట్టి పునః పరిశీలించాలని ఆదేశించింది. 2003 మే 10న జిల్లా కలెక్టర్ అసైన్మెంట్లను రద్దు చేసి భూమిని ప్రభుత్వానికి తిరిగి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2006 ఏప్రిల్ 21న హైకోర్టు కూడా అసైన్మెంట్ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే చట్ట ప్రకారం వాటిని రద్దు చేయవచ్చని స్పష్టంచేసింది. 2007 జనవరి 27న డిప్యూటీ కలెక్టర్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రేహౌండ్స్‌కు అప్పగించాలని ఆదేశించారు.
కాంగ్రెస్ హయాంలో ఎదురుదెబ్బ..
ఈ భూములపై సాగుతున్న న్యాయపోరాటంలో 2010 ఫిబ్రవరి 5 కీలక మలుపుగా మారింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మళ్లీ ఆ భూములు ప్రైవేట్‌పరం చేసేందుకు తీర్పులు వెలువడటంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కుయుక్తులు పన్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరుకాలేదని, కేవలం ప్రభుత్వ న్యాయవాది మాత్రమే హాజరయ్యారని, నాడు ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అవసరమైన స్థాయిలో న్యాయపోరాటం చేయలేదని బీఆర్ఎస్ బాహాటంగా విమర్శిస్తున్నది. ఫలితంగా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా పరిణామాలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు.
సుప్రీంకోర్టులోనూ అనుకూలంగా తుది తీర్పు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత బలమైన న్యాయబృందాన్ని రంగంలోకి దించింది. సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, గిరితోపాటు భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సేవలను వినియోగించుకున్నది. 2023 ఆగస్టు 1న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సివిల్ అప్పీల్ నంబర్ 4835/2023లో తీర్పు వెలువరించింది.
భూమిపై హకు వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పరిషరించిందని, తద్వారా గ్రేహౌండ్స్ భూముల పరిరక్షణకు మార్గం సుగమమైందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో 142 ఎకరాల భూమిని తాము కాపాడితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూముల్లో అక్రమాలు చోటుచేసుకున్నా వాటిని ప్రోత్సహిస్తూ కాపాడే ప్రయత్నం చేయడం లేదని చెబుతున్నారు.
జీరో కన్సిడరేషన్తో రిజిస్ట్రేషన్?
ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం డాక్యుమెంట్ నంబర్ 8886/2026. దీనికి సంబంధించి గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 40,172 చదరపు గజాల భూమికి సంబంధించి కన్వేయన్స్ డీడ్ వితౌట్ కన్సిడరేషన్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగినట్టు బీఆర్ఎస్ చెప్తున్నది. సదరు డాక్యుమెంట్లో భూమి మారెట్ విలువ రూ.45,39,43,600గా పేరొన్నప్పటికీ, కన్సిడరేషన్ విలువ మాత్రం సున్నాగా చూపించారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
అంటే భూమికి మారెట్ విలువ రూ.45 కోట్లకు పైగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రతిఫలం చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేసినట్టు చెప్తున్నారు. సాధారణంగా భూమి విలువ ఆధారంగా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ డాక్యుమెంట్లో జీరో కన్సిడరేషన్ చూపించడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఏ నిబంధనల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేశారు? ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు మినహాయించడానికి ఎవరు అనుమతించారు? అనే బీఆర్ఎస్ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదు.
మరో 10 ఎకరాల ఫైరింగ్ రేంజ్ భూములూ..
గ్రేహౌండ్స్ ఫైరింగ్ రేంజ్ అవసరాల కోసం మంచిరేవులలో మరో 10 ఎకరాల భూమిని సేకరించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో చర్యలు ప్రారంభించింది. 2018 అక్టోబర్ 23న గ్రేహౌండ్స్ విభాగం ప్రభుత్వానికి భూసేకరణ ప్రతిపాదన పంపగా.. అక్టోబర్ 26న ప్రభుత్వం భూసేకరణకు మినహాయింపు మంజూరు చేసింది. 2019 మే 29న ప్రాథమిక భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 జనవరి 21న గడువును పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. చట్టపరమైన గడువు 2020 మే నెలలో ముగియడంతో భూ యజమానులు 2021లో హైకోర్టును ఆశ్రయించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని జనవరి 12న హైకోర్టు ఆదేశించింది. 2024లో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ కేసులో 2026 సెప్టెంబర్ 3న హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి 2019లో జారీ చేసిన భూసేకరణ ప్రక్రియకు చట్టబద్ధమైన ప్రభావం లేదని తీర్పు ఇచ్చినట్టు బీఆర్ఎస్ వెల్లడించింది. అయితే, ఈ తీర్పులోని 134వ పేరాలో ‘ప్రజాప్రయోజనం కోసం భూమి అవసరమైతే భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రభుత్వం కొత్తగా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు తీర్పు అడ్డంకి కాదు’ అని పేరొన్నట్లు బీఆర్ఎస్ వాదిస్తున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయలేదని, కొత్త భూసేకరణ ప్రక్రియను కూడా ప్రారంభించలేదని విమర్శిస్తున్నది. దీంతో ఫైరింగ్ రేంజ్ కోసం అవసరమైన మరో 10 ఎకరాల భూమి కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నది.
సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
మంచిరేవుల గ్రేహౌండ్స్ భూముల వ్యవహారంలో రెండు ప్రధాన అంశాలున్నాయని బీఆర్ఎస్ చెబుతున్నది. మొదటిది 142 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణ కోసం గతంలో జరిగిన న్యాయపోరాటం. రెండోది 10.10 ఎకరాల భూమికి సంబంధించి జరిగినట్టు ఆరోపిస్తున్న ప్రహరీ కూల్చివేత, రిజిస్ట్రేషన్లు, భూ బదిలీలు. ఇవే కాకుండా ఫైరింగ్ రేంజ్ కోసం ప్రతిపాదించిన మరో 10 ఎకరాల భూమి సేకరణ కూడా నిలిచిపోయిందని ఆరోపిస్తున్నది.
ఈ మొత్తం భూముల విలువ కలిపి సుమారు రూ.2,000 కోట్లుగా అంచనా వేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రేహౌండ్స్ భూముల వ్యవహారంపై ఆయన సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. ప్రహరీని ఎవరు కూల్చారు? కొత్త గోడ నిర్మాణానికి ఎవరు అనుమతిచ్చారు? ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థల పేర్లపైకి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? జీరో కన్సిడరేషన్తో డాక్యుమెంట్ నమోదు చేసేందుకు కారణాలేమిటి? భూభారతి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలానికి ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? అందులో ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ అధికారుల పాత్ర ఏమిటనే అంశాలపై సమగ్ర దర్యాప్తు సిట్టింగ్ జడ్జితో జరుగాలని డిమాండ్ చేస్తున్నది.
కేసీఆర్ ఆదేశాలతో న్యాయపోరాటానికి కొత్త ఊపిరి
2017 మే నెలలో అప్పటి సీఎం కేసీఆర్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఐపీఎస్ అధికారుల సమీక్ష సమావేశంలో ఈ గ్రేహౌండ్స్ భూముల అంశం ప్రస్తావనకు వచ్చింది. నాటి గ్రేహౌండ్స్ అధిపతి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ భూముల న్యాయపరమైన పరిస్థితిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసు ఓడిపోయినప్పటికీ భూములను తిరిగి కాపాడుకొనేందుకు ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాదులను నియమించుకోవడానికి అనుమతి ఇవ్వాలని అధికారులు కోరారు.
దీనిపై కేసీఆర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీని ఆదేశించారు. అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, వీ గిరి సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. వీరి వాదనలతో 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అప్పీల్ నంబర్ డబ్ల్యూఏ 202/2010లో వచ్చిన ఈ తీర్పు ద్వారా గ్రేహౌండ్స్ భూములపై ప్రభుత్వ హకును సమర్థించింది.
భూభారతి పోర్టల్లోనూ గ్రేహౌండ్స్ పేరే!
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించింది. భూభారతి పోర్టల్‌లో సదరు సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఇప్పటికీ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ ఆఫ్ తెలంగాణ పేరుతో నిషేధిత జాబితాలో కొనసాగుతున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయి అధికారుల ధ్రువీకరణలతో భూమి ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదైందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూమిగా నిషేధిత జాబితాలో కొనసాగుతుండగా.. మరోవైపు ప్రైవేటు సంస్థల పేర్లపై రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్న స్థలానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ ఎలా చేసిందో తేల్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
ప్రహరీ కూల్చివేత.. 10.10 ఎకరాలపై కన్ను!
మంచిరేవులలోని మృగవని నేషనల్ పార్ సమీపంలో గ్రేహౌండ్స్ ఆధీనంలో ఉన్న భూమిలో 10 ఎకరాల 10 గుంటల స్థలం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సుమారు 40,172 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఈ భూమికి సంబంధించి సర్వే నంబర్లు 362/4, 373/4, 374/4లలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అందుకు కారణం.. ఆ భూమిని ఆనుకుని ఉన్న గ్రేహౌండ్స్ ప్రహరీని రాత్రికి రాత్రే కూల్చేయడం, ఆ తర్వాత కొత్తగా లోపలి వైపు గోడ నిర్మించడం అనుమానాలను తావిస్తున్నది.
సుమారు మూడు దశాబ్దాలుగా ఉన్న రక్షణ గోడను తొలగించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతుండటంతో బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది. కాగా, ఈ స్థలం మారెట్ విలువ ఎకరాకు సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని, మొత్తం 10.10 ఎకరాల విలువ దాదాపు రూ.1,000 కోట్లకు చేరుతుంది. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

