MPDO Pulla Rao | ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి :ఎంపీడీవో పుల్లారావ్
MPDO Pulla Rao | అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీవో పుల్లారావ్ అన్నారు.
నార్నూర్ : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీవో పుల్లారావ్ ( MPDO Pulla Rao ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్( Mankapur ) గ్రామంలో బుధవారం సర్పంచ్ తోడసం రేణుక బాయి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే పంచాయతీని అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రభలకుండా ముందస్తుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే విత్తనాలు విత్తుకోవాలని, వ్యవసాయ అధికారులు సలహా సూచనలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సాయి క్రిష్ణ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావు, మాజీ ఎంపీపీ మెస్రం రూప్ దేవ్, మాజీ సర్పంచ్ రాథోడ్ సావీందర్, ఉప సర్పంచ్ రాథోడ్ గణేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

