Mamata Banerjee | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.. సోనియా గాంధీ ప్రతిపాదన.. మమతా బెనర్జీ స్పందన ఇదే
Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Mamata Banerjee : టీఎంసీ పార్టీని మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా..? ఈ అంశంపై తాజాగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితులుగా పేరు తెచ్చుకున్నవారు కూడా ఆ పార్టీని వీడుతున్నారు.
దీంతో టీఎంసీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో మమతా బెనర్జీ.. సోనియా గాంధీతో భేటీ ఢిల్లీలోని ఆమె నివాసంలో అయ్యారు. ఈ సందర్భంగా బెంగాల్ రాజకీయాలతోపాటు, జాతీయ రాజకీయాలపై కూడా చర్చ జరిగింది. బీజేపీ వరుస విజయాలు, బెంగాల్లో బీజేపీ నేతల ఒత్తిడి కారణంగా టీఎంసీ నేతలు పార్టీని వీడుతున్నారని మమత.. సోనియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ.. మమతకు ఒక కీలక సూచన చేశారు. టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆమె మమతను కోరారు. అయితే, దీనిపై మమత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం కొంత సమయాన్ని మమత కోరారు.
కొన్ని రోజుల తర్వాత తన నిర్ణయాన్ని చెబుతానని మమత సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై సోనియా, మమత సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే, నాయకత్వంపై మమత సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమత హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమితో కలిసి పని చేసేందుకు టీఎంసీ సిద్ధంగా ఉంది. త్వరలోనే టీఎంసీ.. కాంగ్రెస్‌లో విలీనం కావడంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

