దేవరకొండ రూరల్, ఆగస్టు 05 : దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో “పుణ్య క్షేత్ర దర్శినిష పేరుతో తెలంగాణ రాష్ట్రంతో పాటు అంతర్ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక డీలక్స్, సూపర్ లగ్జరీ (పుష్ బ్యాక్ సీట్లు) బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు. ప్రస్తుత ఆషాడ మాసం, రాబోయే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు ప్రత్యేకంగా పవిత్రమైన ప్రముఖ పుణ్య క్షేత్రాలను అతి తక్కువ సమయంలోనే సందర్శించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. అనుభవం కలిగిన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణతో పంపించనున్నట్లు పేర్కొన్నారు.
1. ఆలంపూర్, బీచ్పల్లి, శ్రీరంగాపురం, జటప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం
2. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమురవెల్లి
3. భద్రాచలం, మల్లూరు, మేడారం, రామప్ప దేవాలయం
4. కాళేశ్వరం, భద్రకాళి టెంపుల్ (వరంగల్), వేయి స్తంభాల గుడి( హనుమకొండ)
5. పంచదేవ పహాడ్, మఖ్తల్, మన్యంకొండ, కురుమూర్తి, గంగాపూర్
6. విజయవాడ, పెద్దపులిపాక, పెనుగొండ, వాడపల్లి
7. కొల్హాపూర్, జ్యోతిబా, పండరిపూర్, తుల్జాపూర్, గానగాపూర్
8. మంత్రాలయం, పంచముఖి, దేవసుగూర్, మన్యంకొండ
పై యాత్రలే కాకుండా భక్తుల కోరిక మేరకు కనీసం 30 మంది ఉంటే వారు కోరుకున్న యాత్రా స్థలాలకు బస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందరికీ అందుబాటు ధరలకు బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేవరకొండ ప్రాంత భక్తులు, ప్రయాణికులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9848847419 నంబర్ కి గానీ, డిపోలో కానీ సంప్రదించాలని సూచించారు.