గొల్లపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన
దేవరకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో వీబీ రామ్ జీ నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు అలాగే...
దేవరకొండ రూరల్, ఆగస్టు 05 : దేవరకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో వీబీ రామ్ జీ నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు అలాగే రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విన్నవించిన పలు సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు లోకసాని శ్రీధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గండు రవి, ఉపసర్పంచ్ దొంతినేని జానకిరామారావు, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు కొర్ర రాంసింగ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, తాటికోల్ సర్పంచ్ చల్లమల విజయ్, పరిసర గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

