Hanuman Ansh | రూ. 2 కోట్ల బడ్జెట్‌తో వచ్చి రూ. 200 కోట్లు కొల్లగొట్టిన ‘హనుమాన్ అంశ్’!
Hanuman Ansh | భక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన చిన్న సినిమా 'హనుమాన్ అంశ్' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం మరియు బోధనల ఆధారంగా కేవలం రూ. 2 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Hanuman Ansh | భక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన చిన్న సినిమా ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం మరియు బోధనల ఆధారంగా కేవలం రూ. 2 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన తొలి రోజు కేవలం రూ. 10 లక్షలతో ప్రారంభమైన ఈ సినిమా, మౌత్ టాక్ ద్వారా అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ పోయి బడ్జెట్‌కు దాదాపు 100 రెట్లు లాభాలను ఆర్జించి, తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఈ స్థాయి రికార్డు సృష్టించిన అత్యంత చిన్న భారతీయ చిత్రంగా నిలిచింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మిర్జాపూర్: ది మూవీ’ మరియు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ‘హైవాన్’ వంటి పెద్ద చిత్రాలను సైతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టడం విశేషం. ఆరు వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ థియేటర్లలో ఈ చిత్రానికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. తల్లి మరణం తర్వాత జీవితం, మరణం గురించిన నిజాలను వెతుకుంటూ ఉత్తర భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగించి, చివరికి ప్రముఖ సన్యాసి నీమ్ కరోలీ బాబాగా మారిన ఒక యువకుడి హృద్యమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

