Osama Bin Laden | అమెరికాకంటే ముందే ఇండియాపై దాడికి బిన్ లాడెన్ ప్లాన్.. సంచలన విషయం వెల్లడి
Osama Bin Laden : అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇండియాపై దాడికి కుట్ర పన్నినట్లు తాజాగా వెల్లడైంది. అది కూడా అమెరికాపై సెప్టెంబర్ 11న దాడికి ముందే ఇండియాలో కూడా దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు తేలింది.
Osama Bin Laden : అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇండియాపై దాడికి కుట్ర పన్నినట్లు తాజాగా వెల్లడైంది. అది కూడా అమెరికాపై సెప్టెంబర్ 11న దాడికి ముందే ఇండియాలో కూడా దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు తేలింది. అమెరికాపై దాడి జరిగి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ.. ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన కీలక వివరాల్ని వెల్లడించింది. 100 పేజీలకు పైగా ఉన్న నివేదికను విడుదల చేసింది.
1998 నుంచి సేకరించిన సమాచారం ఇది. బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఎ థ్రెట్ పేరుతో వచ్చిన ఈ నివేదిక ప్రకారం.. బిన్ లాడెన్ ఇండియాతోపాటు ఈజిప్ట్, అరేబియా దేశాలు, ఉగాండా వంటి పలు దేశాలపై దాడికి ప్లాన్ చేశాడు. 1998 సమయంలోనే ఈ దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. అది కూడా అమెరికాపై దాడులకు ముందే. అయితే, ఇండియాలో ఎప్పుడు దాడి చేయాలనుకున్నాడు.. ఎక్కడ, ఎలా దాడి చేయాలనుకున్నాడు వంటి అంశాల్ని ఈ నివేదికలో పేర్కొనలేదు. నివేదిక ప్రకారం లాడెన్ ఉగ్ర నెట్వర్క్ దాదాపు 50 దేశాల్లో విస్తరించి ఉంది.
ఆఫ్గనిస్తాన్ నుంచి లాడెన్ తన ఉగ్రకార్యకలాపాల్ని సాగించాడు. అదే సమయంలో అమెరికా జరిపిన మిస్సైల్స్ దాడుల నుంచి అతడు తప్పించుకున్నాడు. 1998లో ఆఫ్గనిస్తన్లోని అల్‌ఖైదా స్తావరాలపై అమెరికా దాడి చేసింది. అల్‌ఖైదాను స్థాపించింది బిన్ లాడెన్ అనే సంగతి తెలిసిందే. అనంతరం మూడేళ్లకు.. అంటే 2001లో సెప్టెంబర్ 11న అమెరికాలోని న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్‌కు చెందిన ట్విన్ టవర్స్‌పై విమానాలతో అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ దాడిలో దాదాపు మూడు వేల మంది మరణించారు. 19 మంది హైజాకర్లు కూడా మరణించారు. అప్పటినుంచి లాడెన్ కోసం అమెరిగా గాలిస్తూనే ఉంది. చివరకు 2011, మే 2న పాకిస్తాన్లో దాక్కున్న లాడెన్‌ను అమెరికా సైన్యం చంపేసింది. దీంతో నెమ్మదిగా అల్ ఖైదా కార్యకలాపాలు స్తంభించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

