Harish Rao | వినాయకుడి రూపంలోనే మనకు ఎన్నో సందేశాలు : హరీశ్ రావు
Harish Rao | వినాయక విగ్రహాన్ని ఎంత పెద్దగా పెట్టామన్నది ముఖ్యం కాదని.. ఎంత భక్తిశ్రద్ధలతో పూజించామన్నదే ముఖ్యమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. ఊరికి ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజించాలని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు.
Harish Rao | సిద్దిపేట జిల్లా, ఆగస్టు 13 : విఘ్నేశ్వరుడు దేవుడే కాకుండా ప్రజలందరికీ మార్గదర్శకుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వినాయక విగ్రహాన్ని ఎంత పెద్దగా పెట్టామన్నది ముఖ్యం కాదని.. ఎంత భక్తిశ్రద్ధలతో పూజించామన్నదే ముఖ్యమన్నారు. ఊరికి ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజించాలని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. ఏ గ్రామంలోనైనా, వార్డులోనైనా ఒక్కటే ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే తాను పర్మినెంట్ షెడ్డు నిర్మించి ఇస్తానని పిలుపునిచ్చారు…
రసాయనాలతో కూడిన వినాయకులను చెరువులో నిమజ్జనం చేయడంతో నీళ్లలో ఉండే జీవరాశులు చనిపోవడంతోపాటు భూమి కలుషితమై ప్రజా ఆరోగ్యానికి కీడు చేసే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు… వినాయకుడి రూపంలోనే మనకు ఎన్నో సందేశాలు ఉన్నాయి. ఆయన పెద్ద తల గొప్పగా ఆలోచించమని చెబుతుంది… పెద్ద చెవులు ప్రజల మాట వినాలని చెబుతాయి… చిన్న కళ్లు లక్ష్యంపై దృష్టి పెట్టాలని చెబుతాయి. ఆయన తొండం పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని నేర్పుతుంది. అందుకే గణపతి కేవలం పూజించే దేవుడు మాత్రమే కాదు… మన జీవితానికి మార్గదర్శకుడన్నారు..
ప్రకృతిని ప్రేమించి, పుష్పాలను ప్రేమించే గొప్ప సంస్కృతి మన తెలంగాణ వారిదన్నారు. దక్షిణ భారతదేశంలోనే అమర్నాథ్ అన్నా సేవ సమితి ప్రసిద్ధిగాంచిందన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా మంచు కొండల్లో సేవలందించడం గొప్ప విషయమన్నారు. అలాగే ప్రకృతిని ప్రేమిస్తూ 16 సంవత్సరాలుగా సిద్దిపేటలో ప్రతి సంవత్సరం 10 వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మనం ఏ కార్యక్రమం చేపట్టిన ముందు విఘ్నేశ్వరుని పూజించే చేపడుతామని ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానారు.
విఘ్నేశ్వరుడి దయతో విఘ్నాలు తొలగాలి..
వినాయక చవితి పర్వదినం సందర్బంగా హరీశ్ రావు ప్రజలందరికి వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది, పూజించేది విఘ్నేశ్వరుడినే… ఆ దేవుడి అనుగ్రహంతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలన్నారు. నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలి.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.. మట్టి గణపతి ప్రతిమను పూజించాలి ‘మట్టి గణపతే మహా గణపతి అని అన్నారు.

Read Also :
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

