Low-voltage | లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఓల్టేజి కరెంటుతో సాగు నీరు అందకపోవడంతో రైతన్నలు సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి కూడలిలో బైఠాయించి రాస్తా రోకో నిర్వచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రీఫేజ్ కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికారులకు విన్నవించినా పరిస్థితి మెరుగుపడలేదని వాపోయారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ సమస్యలు లేవని.. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి విద్యుత్తు సమస్యలు మొదలైనట్టు చెప్పారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదోకోవాలని డిమాండ్ చేశారు.