వాషింగ్టన్ : ఫ్లైదుబాయ్ పైలట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానం కాక్‌పిట్‌లో పైలట్‌పై కోపైలట్ కత్తితో దాడి చేశాడు. అయితే విమానం హైజాక్‌ను పైలట్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లైదుబాయ్ పైలట్‌ను స్మిత్ మచ్చర్(Smit Machchhar)గా గుర్తించారు. భారత జాతీయుడైన మచ్చర్ చూపిన తెగువను అందరూ ప్రశంసిస్తున్నారు. అతన్ని హీరోగా పోల్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మాట్లాడిన ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూతో ఈ అంశం గురించి మాట్లాడినట్లు చెప్పారు. భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ కూడా పైలట్ మచ్చర్ సాహసాన్ని కొనియాడారు.
బహుశా ఆ పైలట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉండి ఉంటుందని, కానీ అతను చూపిన తెగువ అద్భుతమని, అతనో హీరో అంటూ ట్రంప్ పేర్కొన్నారు. పైలట్ తన కాక్‌పిట్ డోర్‌ను తెరిచి, ప్రయాణికుల నుంచి సహాయం కోరాడని, బహుశా ఆ కోపైలట్ ఉగ్రవాది అయి ఉంటాడని ట్రంప్ అన్నారు. ఓ ఇజ్రాయిలీ ప్యాసింజర్ రక్తసిక్తమైన పైలట్ మచ్చర్‌ను కాపాడినట్లు ట్రంప్ తెలిపారు. పైలట్‌పై దాడి జరిగిన సమయంలో విమానంలో 174 మంది ఉన్నారు. పైలట్‌పై కత్తిపోటు ఘటన తర్వాత విమానం కేవలం 30 సెకన్లలో దాదాపు 14వేల ఫీట్లు కిందకు దిగింది.
సౌదీ అరేబియాలోని తబుక్‌లో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్‌ను కత్తితో పొడిచిన కోపైలట్ .. ఆ విమానాన్ని కూల్చేందుకు కుట్రపన్నాడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ తెలిపారు. ప్రస్తుతం తబుక్ ఆస్పత్రిలో పైలట్ మచ్చర్ చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నది. పైలట్ మచ్చర్ కాక్‌పిట్‌లో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. అయితే అతను కాక్‌పిట్ రిలీజ్ అయ్యే బటన్ నొక్కడంతో.. ప్రయాణికులు వచ్చి కోపైలట్‌ను నియంత్రించారు. ఇక ఆ విమానంలో ఉన్న ఫ్లైదుబాయ్ సెకండ్ పెయిర్ పైలట్లు.. విమానాన్ని తబుక్‌లో దించారు.
Captain Smit Machchhar has shown the world the highest form of courage.
Without fearing for his own life, he fought valiantly and prevented another 9/11 like attack from happening.
140 crore Indians salute Captain Smit and are praying for his well-being. pic.twitter.com/YGTA9CFCAg
— Narendra Modi (@narendramodi) October 1, 2026