Supreme court | తమిళనాడు ఏడీజీపీ సస్పెన్షన్.. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
Supreme court | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం తిరువళ్లూరు (Thiruvalluru) జిల్లా కళంబాక్కంకు సంబంధించిన ఓ ప్రేమ వ్యవహారంలో యువకుడి కిడ్నాప్ (Kidnap) తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏడీజీపీ (ADGP) జయరామ్ (Jayaram) ను అరెస్టు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
Supreme court : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం తిరువళ్లూరు (Thiruvalluru) జిల్లా కళంబాక్కంకు సంబంధించిన ఓ ప్రేమ వ్యవహారంలో యువకుడి కిడ్నాప్ (Kidnap) తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏడీజీపీ (ADGP) జయరామ్ (Jayaram) ను అరెస్టు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓ సీనియర్ పోలీసు అధికారి విచారణలో పాల్గొన్నందుకు ఆయనను ఎలా సస్పెండ్ చేస్తారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. కళంబాక్కంకు చెందిన ఓ యువకుడు ఇటీవల తేనికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడి 16 ఏళ్ల సోదరుడు కిడ్నాప్ అయ్యాడు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఏడీజీపీ జయరామ్‌కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఏడీజీపీని అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో ఏడీజీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టైన వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏడీజీపీ హోదాలో ఉన్న తనను అరెస్టు చేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ కౌన్సిల్ వాదనలు వినిపించారు.
ఏడీజీపీని కస్టడీలోకి తీసుకుని విచారణ అనంతరం మంగళవారం సాయంత్రమే విడుదల చేశామని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే తనను పోలీసులు విడుదల చేసినప్పటికీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందని ఏడీజీపీ వాదించారు. దాంతో సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఆయనొక సీనియర్ పోలీసు అధికారి అని, ఆయయను సస్పెన్షన్‌లో పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆశ్యర్యం కలిగించాయని వ్యాఖ్యానించింది. ఆ ఉత్తర్వులు నిరుత్సాహపరిచేలా ఉన్నాయని కోర్టు ఆగ్రహించింది. గురువారం నాటికి ఏడీజీపీపై సస్పెన్షన్‌ను రద్దు చేసి.. ఆ సమాచారాన్ని న్యాయస్థానానికి తెలియజేయాలని ఆదేశించింది.
Read More >>
‘డబ్బులిచ్చి ఆమెతో ఎవరైనా శృంగారం చేయొచ్చు’ .. శాడిస్ట్ భర్తకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరణ
ఆ ముక్క ట్రంప్ చెప్పాలె.. ప్రధానిని నమ్మేదెవరు..? : సంజయ్ రౌత్
ఫ్లైవోవర్ పైనుంచి పడిన మామిడి కాయల వ్యాన్.. నలుగురు దుర్మరణం
క్యాన్సర్ బారిన పడిన నటి.. లేటెస్ట్ లుక్ చూసి షాక్
నేటి నుంచి టెట్ పరీక్షలు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
దిగొచ్చిన పుత్తడి.. తులంపై రూ.1,200 తగ్గుదల..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

