Sanjay Raut : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) వర్గం శివసేన (Shivsena) పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) మరోసారి విమర్శలు గుప్పించారు. భారత్-పాకిస్థాన్ వివాదంలో థర్డ్‌పార్టీ జోక్యాన్ని అంగీకరించబోమని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్లో చెప్పినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దీనిపై సంజయ్ రౌత్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తన జోక్యంతోనే సద్దుమణిగాయని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 17 సార్లు చెప్పారని, ఈ క్రమంలో థర్డ్ పార్టీ జోక్యాన్ని అవసరం లేదని ట్రంప్‌తో ప్రధాని ఫోన్లో చెప్పారంటే ఎవరు నమ్ముతారని రౌత్ అనుమానం వ్యక్తంచేశారు. మోదీ తనతో మాట్లాడారు, భారత్-పాక్ వివాదంలో థర్డ్ పార్టీ జోక్యం వద్దన్నారు, ఈ అంశంపై ఇప్పటివరకు తాను చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకుంటున్నాను అని ట్రంప్ చెప్పాలన్నారు.
ప్రధాన మోదీ మాటలను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. భారత్-పాకిస్థాన్ వివాదంలో థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఎన్నడూ అంగీకరించలేదని, ఇక ముందు కూడా అంగీకరించబోదని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్లో చెప్పారని, వారి మధ్య అరగంటపాటు ఫోన్ సంభాషణ జరిగిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ క్రమంలో ఆ విషయం ట్రంప్ చెప్పాలంటూ రౌత్ స్పందించారు.