Actress | ప్రముఖ నటి హీనా ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలోకి అనుకోకుండా క్యాన్సర్ మహమ్మారి వచ్చింది. హీనా గత కొద్ది రోజులుగా బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి గురించి షేర్ చేస్తుంది. ఇదివరకే కిమోథేరపీ చికిత్స కారణంగా ఆమె జుట్టును కూడా కోల్పోయింది. ఆ తర్వాత తన కనుబొమ్మలను కూడా కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది హీనా ఖాన్.
కీమోథెరపీ చికిత్సలో భాగంగా నా కనురెప్పలు రాలిపోయాయి. నా వెంట్రుకలన్నీ రాలిపోయినప్పటికీ ఈ ఒక్క కనురెప్ప నాకు స్ఫూర్తినిస్తుంది. నేను షూట్ కోసం కనురెప్పలు ధరించవలసి వచ్చింది అంటూ కొద్ది రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టింది. ఇక తలపై జుట్టు లేకుండా గుండు చేయించుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది. క్యాన్సర్ చికిత్స కారణంగా జుట్టు ఊడిపోతున్నందున గుండు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో ఆమె ఈ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొంటాను, త్వరలోనే కోలుకుంటాను అని తెలిపారు. అయితే, ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు, ముఖ్యంగా ఆమె గోర్లకు నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు కనిపించడంతో ఈ సమయంలో అవసరమా అంటూ ట్రోల్ చేశారు. దీనిపై హీనా ఖాన్ స్పందిస్తూ, క్యాన్సర్ చికిత్స వల్ల నా గోర్లు మారిపోయాయి, అందుకే గోర్లకు నెయిల్ పాలిష్ వేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజాగా హీనా ఖాన్ తన పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో నైట్ డ్రెస్ ధరించి రెండు చిన్న పిలకలు వేసుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఏడాదిన్నర తర్వాత నా జుట్టుని పిగ్టైల్స్లో పెట్టాను.నేను నా జట్టుని ఎంత మిస్ అయ్యానో మాటలలో వర్ణించలేను.వెయిటింగ్.. వన్ డే ఎట్ ఏ టైమ్.. ఉఫ్.. చిన్న పిలకలు అంటూ పోస్ట్ పెట్టింది. నెటిజన్లు ఈ నటి పోరాటాన్ని ప్రశంసిస్తూ, వారిని మద్దతు తెలుపుతున్నారు. అయితే, కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్ చేయడం తప్పు. ఈ సమయంలో ఆమె ధైర్యాన్ని, పోరాటాన్ని ప్రశంసించాలి, వారి వ్యక్తిగత విషయాలను గౌరవించాలి అని కామెంట్స్ రూపంలో కొందరు నెటిజన్స్ రాసుకొస్తున్నారు.