న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నూతన హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు సెలెరియో మార్కెట్లో ఆవిష్కరణ జాప్యం కానున్నది. కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది తొలిసారి విధించిన లాక్డౌన్ వల్ల ఆటోమొబైల్స్ సేల్స్ పడిపోయాయి.
2020 చివరి దశలో ఆటోమొబైల్ రంగం కోలుకున్నట్లే కనిపించినా, ఈ ఏడాది రెండో వేవ్ మరోమారు విశ్వరూపం ప్రదర్శిస్తున్నది. ఫలితంగా దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో కార్లు, బైక్స్ విక్రయాలు ఆగిపోయాయి.
మరోవైపు న్యూ జనరేషన్ మోడల్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. ప్రస్తుత మోడల్ కారు కంటే చిన్నగా లైట్ వెయిట్ హియర్టెక్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నది. నూతన మోడల్ కారు రీఫ్రెష్డ్ లుక్‌తో కనిపిస్తుంది.
ఔట్‌సైడ్‌లో న్యూ గ్రిల్లే, స్లీకర్ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ ఫాగ్ ల్యాంప్స్, రీ డిజైన్డ్ బంపర్లు, న్యూ అల్లాయ్ వీల్స్, రాప్రౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు జత కలిశాయి.
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతోపాటు ఏబీఎస్, ఫ్రంట్ రో సీట్ బెల్ట్ రిమైండర్లు కూడా ఉన్నాయి. న్యూ మారుతి సెలెరియోలో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తదితర కొన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి