సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 13, 2020 , 20:15:15

అసింప్ట‌మాటిక్.. అయినా ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం!

అసింప్ట‌మాటిక్.. అయినా ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం!

హైద‌రాబాద్‌: మాలో క‌రోనా వ్యాధి ల‌క్ష‌ణాలు లేవు! క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా మేం అదృష్ట‌వంతులం! ఎందుకంటే మేం సీరియ‌స్ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు! వైర‌స్ కార‌ణంగా వ‌చ్చే దీర్ఘకాలిక రుగ్మ‌త‌ల ప్ర‌భావం మాపై ఉండ‌దు! క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌ని బాధితుల మ‌నోగ‌తం ఇన్నాళ్లు ఈ విధంగా ఉండేది. కానీ, వారి అభిప్రాయం త‌ప్ప‌ని తాజాగా ఓ అధ్య‌య‌నంలో తేలింది. క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌టికి క‌నిపించ‌క‌పోయినా ఆరోగ్యంపై వైర‌స్ దుష్ప్ర‌భావం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టంచేశారు.     

తాజాగా చైనాలోని వుహాన్ న‌గ‌రంలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌ని‌పించిన కేసులు, క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌ని పాజిటివ్ కేసులపై అధ్య‌య‌నం చేశారు. ఆ అధ్య‌య‌నంలో క‌‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న బాధితుల సీటీ స్కాన్‌ల‌లో మాదిరిగానే.. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని పాజిటివ్ కేసుల సీటీ స్కాన్‌ల‌లో కూడా ఊపిరితిత్తుల్లో చాలా మార్పులు చోటుచేసుకున్న‌ట్లు గుర్తించారు. దీంతో అసింప్ట‌మాటిక్ కేసుల‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు బ‌య‌టికి క‌నిపించ‌న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ లాంటి దుష్ప్ర‌భావాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని పరిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.    

కాగా, క‌రోనా వ‌చ్చిన తొలి రోజుల్లో వైర‌స్ గురించి చాలా కొద్ది స‌మాచారం మాత్ర‌మే ఉండేది. ఆ త‌ర్వాత ప‌రిశోధ‌కులు, వైద్య నిపుణులు క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న వేగాన్ని గ‌మ‌నించి ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర్వాత క‌రోనా‌ ల‌క్ష‌ణాలు లేకున్నా పాజిటివ్ వ‌చ్చిన కేసులను గుర్తించి ఆందోళ‌న చెందారు. అలాంటి వారి ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. 

అయితే, ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ‌, ఇత‌ర ప్ర‌భుత్వ సంస్థ‌లు, విడివిడిగా దేశాలు విడుద‌ల చేసిన క‌రోనా ల‌క్ష‌ణాల జాబితాల్లోని ఏ ఒక్క ల‌క్ష‌ణం కూడా అసింప్టమాటిక్ కేసుల‌లో క‌నిపించడంలేదు. దీంతో అస‌లు అసింప్ట‌మాటిక్ క‌రోనా బాధితులు మ‌హ‌మ్మారి వ్యాప్తికి కార‌కులు అవుతారా లేదా అనే విష‌యంలో ఇంకా సందేహాలు నెల‌కొన్నాయి.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo