బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం

న్యూఢిల్లీ : బహుళ జాతి సంస్ధలపై బైడెన్ ప్రభుత్వం నూతన లెవీలు విధించనుండటంతో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత్‌కు చెందిన ఐటీ, ఫార్మా దిగ్గజాలపై పన్ను భారం తీవ్రతరం కానుంది. బహుళ జాతి సంస్ధల అంతర్జాతీయ లాభాలపై మినిమం ట్యాక్స్‌ను విధించాలని అమెరికా యంత్రాంగం కసరత్తు సాగిస్తోంది. ఏ దేశంలోనైనా తమ లాభాల్లో కనీసం 28 శాతం పన్ను చెల్లించని కంపెనీలపై అమెరికాలో అదనపు లెవీల వడ్డన తప్పదని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజడ్లు) ద్వారా అమెరికాలో కార్యకలాపాలు సాగించే భారత ఐటీ, ఫార్మా కంపెనీలపై అదనపు పన్నుల భారం ఉంటుందని వారు చెబుతున్నారు.
నూతన లెవీ నిబంధనల ప్రకారం తమ లాభాలపై కనీస పన్ను చెల్లించని కంపెనీలు అమెరికాలో అదనపు పన్నులను చెల్లించాలని పన్ను నిపుణులు వెల్లడించారు. భారత సెజ్‌ల నుంచి అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తూ పన్ను రాయితీలు పొందుతున్న భారత ఐటీ, ఫార్మా కంపెనీలు అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుందని పన్ను నిపుణులు గిరీష్ వన్వారీ పేర్కొన్నట్టు ఓ వాణిజ్య వెబ్సైట్ కథనం వెల్లడించింది. నూతన పన్ను నిబంధనలతో సబ్సిడరీల ద్వారా నిర్వహించే భారత ఐటీ, ఫార్మా కంపెనీలతో పాటు అమెరికా ఎక్స్ఛేంజ్ల్లో ప్రత్యేకంగా లిస్టయిన సంస్థలపైనా పన్ను భారం పడనుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- India
- IT companies
- Joe Biden
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

