e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ఆర్‌బీఐ అలర్ట్‌.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్‌టీజీఎస్‌ సేవలు

ఆర్‌బీఐ అలర్ట్‌.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్‌టీజీఎస్‌ సేవలు

ఆర్‌బీఐ అలర్ట్‌.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్‌టీజీఎస్‌ సేవలు

న్యూఢిల్లీ : పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్‌బీఐ కీలక అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 17న సాధారణ కార్యకలాపాలు ముగిసిన తర్వాత 18న రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు 14 గంటల పాటు సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఆర్‌బీఐ ఆర్‌టీజీఎస్ సేవలు నిలిచిపోయిన సమయంలో వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ టాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది.

ఈ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదని, ఆర్‌టీజీఎస్ సేవలకు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని సూచించింది. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని వినియోగదారులకు తెలుపాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి లావాదేవీలు జరిపేందుకు ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఆర్‌టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి. భారతదేశంలో ఆర్‌టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి.

ఇవికూడా చదవండి..

పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్‌ తీస్కో!
15-04-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు
రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్‌ సజీవ దహనం
కుంభమేళా కుదింపు కుదరదు : అధికారులు
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
రాష్ట్రంలో కొత్త‌గా 3037 క‌రోనా కేసులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్‌బీఐ అలర్ట్‌.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్‌టీజీఎస్‌ సేవలు

ట్రెండింగ్‌

Advertisement