దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 18న 1,033 మరణాలు సంభవించాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ.. కేసులు ఏమాత్రం తగ్గకపోగా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 24 గంటల్లో కొత్తగా 93,528 మంది డిశ్చార్జి అయ్యారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా.. మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. ఇప్పటి వరకు 1,24,29,564 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో 11,44,93,238 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కొవిడ్ కేసులో భారత్ రెండో స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి. రోజుకు లక్ష నుంచి రోజుకు రెండు లక్షల కేసుల సంఖ్యను చేరుకోవడానికి అమెరికా 21 రోజులు పట్టగా.. భారతదేశం కేవలం 11 రోజుల్లో చేరింది. మరో వైపు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో కరోనా బారిన పడి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు గంటలకొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అహ్మదాబాద్‌లో ఆసుపత్రుల్లో పడకలు లేక.. వెలుపల కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు కనిపించడం ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవికూడా చదవండి..
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్ తీస్కో!
15-04-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ సజీవ దహనం
కుంభమేళా కుదింపు కుదరదు : అధికారులు
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

