రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని ఇద్దరు సజీవ దహనం
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ |

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటెయినర్ లారీ మరో గురువారం ఉదయం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కంటెయినర్ లారీకి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ సహా క్లీనర్ క్యాబిన్‌లోనే చిక్కుకొని సజీవ దహనమయ్యారు. ఔటర్ రింగ్‌రోడ్డు ప్రమాదం జరుగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి కంటెయినర్ రొయ్యల లోడ్‌తో వస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. కేకలు విన్న అక్కడే ఉన్న వారంతా రక్షించే ప్రయత్నం చేశారు.

డోర్లు లాక్ కావడంతో బయటకు రాలేకపోయారు. అద్దాలు పగులగొట్టినా.. అప్పటికే మంటలు క్యాబిన్లోకి చేరుకున్నాయి. దీంతో మంటలు అంటుకొని మృతి చెందారని స్థానికులు, పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపశాఖ సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. మంటల్లో చిక్కుకొని మృతి చెందిన వారిని డ్రైవర్ సూరజ్, క్లీనర్ మృత్యుంజయగా పోలీసులు గుర్తించారు. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో కంటెయినర్ ముందుభాగం బాగా దెబ్బతినడంతో పాటు మంటలకు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
కుంభమేళా ఒక కరోనా ఆటం బాంబు.. రాంగోపాల్ వర్మ సెటైర్లు
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్ తీస్కో!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

