బుధవారం 12 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:24:23

వైరస్‌ వర్రీ...

వైరస్‌ వర్రీ...

నగరాన్ని వదలని కరోనా.. 

నివారణ చర్యలు పాటించని జనం..

నగరాన్ని కరోనా వదలడం లేదు. భౌతికదూరం పాటించడంలో నిర్లక్ష్యం..మాస్కులు ధరించడంలో అలసత్వంతో వైరస్‌ విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్‌ కేసులు వందల్లో నమోదవుతున్నాయి. ఆదివారం జీహెచ్‌ఎంసీలో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్‌లో 94 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది.  

పాజిటివ్‌ కేసులు

జీహెచ్‌ఎంసీలో.. 800

రంగారెడ్డిలో.. 132

మేడ్చల్‌లో.. 94

మల్కాజిగిరి: మల్కాజిగిరి జీహెచ్‌ంఎసీ కార్యాలయంలోని ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

అంబర్‌పేట: అంబర్‌పేటలో 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

శామీర్‌పేట : తూంకుంట మున్సిపాలిటీలో ముగ్గురు కరోనా బారినపడ్డారు. అధికారులు వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.

రామంతాపూర్‌ : ఉప్పల్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలో 36 కరోనా కేసులు నమోదైనట్లు కమ్యూనిటీ హెల్త్‌ అధికారి తెలిపారు. 

తెలుగుయూనివర్సిటీ:  నిలోఫర్‌ దవాఖానలో  చికిత్స పొందుతున్న ఇద్దరు గర్భిణులు, ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌గా తేలిందని  కో ఆర్డినేటర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. వారిని చికిత్స కోసం గాంధీ వైద్యశాలకు తరలించినట్లు వెల్లడించారు. అలాగే ముగ్గురు పీజీ వైద్యులకు వైరస్‌ సోకిందన్నారు. 

బషీర్‌బాగ్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 21 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

బోడుప్పల్‌: బోడుప్పల్‌ రాజలింగం కాలనీకి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.

మల్లాపూర్‌: ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 11 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.

కేపీహెచ్‌బీకాలనీ: కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. 

మేడ్చల్‌ కలెక్టరేట్‌: దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు కీసర వైద్యాధికారి సరిత తెలిపారు. 

కీసర: కీసర మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, స్థానికులకు మొత్తం 31 మందికి పరీక్షలు చేయగా, వారిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్‌ సరిత తెలిపారు.  

మేడ్చల్‌రూరల్‌: మేడ్చల్‌ ప్రాంతంలో నలుగురికి కరోనా సోకింది. గుండ్లపోచంపల్లిలో ముగ్గురికి, గౌడవెల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

హిమాయత్‌నగర్‌: హైదర్‌గూడలో నలుగురికి, హిమాయత్‌నగర్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి హేమలత తెలిపారు.

వెంగళరావునగర్‌: సర్కిల్‌-19 పరిధిలో 48 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ లో 20 మందికి, బోరబండలో 9, రహ్మత్‌నగర్‌లో 8, ఎర్రగడ్డ లో 6, వెంగళరావునగర్‌లో ఐదుగురికి వైరస్‌ సోకినట్లు డీఎంసీ వివరించారు. 


తాజావార్తలు


logo