ఇంట్లోనే ఉన్నా కరోనా ఎలా వచ్చిందంటున్న స్టార్ హీరో

ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టలేదు. మా అపార్ట్మెంట్ బిల్డింగ్‌ను సీల్ చేశారు. 14 రోజులు ఇంట్లోనే ఉన్నాం. అయినా నాతోపాటు నా కుటుంబం కొవిడ్ బారిన పడింది అని బాలీవుడ్ స్టార్ హీరో రాహుల్ రాయ్ చెప్పాడు. తన కరోనా స్టోరీని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేద్ద పోస్ట్ చేశాడు. తమ పొరుగింట్లో ఉండే వ్యక్తికి కరోనా రావడంతో మార్చి 27నే తమ బిల్డింగ్‌ను సీల్ చేశారని, అప్పటి నుంచి 14 రోజుల పాటు తాము ఇంట్లోనే ఉన్నామని అతడు చెప్పాడు. తాను ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చిందని, ఆశ్చర్యకరంగా మొత్తం కుటుంబానికి పాజిటివ్‌గా తేలిందని రాహుల్ రాయ్ ఇన్‌స్టాలో తెలిపాడు.
తమకు అసలు ఎలాంటి లక్షణాలు లేవని అతడు అన్నాడు. గతేడాది నవంబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఈ ఆశిఖి మూవీ స్టార్.. ఇంట్లో నుంచి కదలకపోయినా వైరస్ తమకు ఎలా అంటుకున్నదో అర్థం కావడం లేదని వాపోతున్నాడు. నా ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వలేదని అన్నాడు. ఇక తన సోదరి ప్రియాంకా రాయ్ మూడు నెలలుగా ఇంట్లో నుంచి కదల్లేదని, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఆమెకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని రాహుల్ చెప్పాడు. ప్రస్తుతానికి 14 రోజుల క్వారంటైన్లో ఉన్నామని, తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకుంటామని అతను అన్నాడు.
ఇవి కూడా చదవండి
ఫైవ్ స్టార్ హోటళ్లలో కొవిడ్ బాధితులకు చికిత్స
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇండియా, పాకిస్థాన్ రహస్య చర్చలు!
IPL 2021: సహనం కోల్పోయిన కోహ్లి.. మందలించిన మ్యాచ్ రిఫరీ
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం
అలియా భట్‌కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

